Investment: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడంతో దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. కానీ, చాలా మంది పొరపాటున కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ పొరపాట్లే పెట్టుబడులపై నష్టాలను మిగుల్చుతాయి. మరి మ్యూచువల్ ఫండ్స్‌లో హైరిటర్న్స్ అందుకోవాలంటే నివారించాల్సిన తప్పులు ఏంటి? వాటిని ఏ విధంగా అధిగమించాలి? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకపోవడంచాలా మంది చేసే మొదటి తప్పు ఇదే. ఎందుకు పెట్టుబడి పెడుతున్నాం, ఏ లక్ష్యం కోసం ఇన్వెస్ట్ చేస్తున్న? అని ఆలోచించకుండా పెట్టుబడులు మొదలు పెడతారు. పిల్లల చదువు, పెళ్లిళ్లు, ఇల్లు కొనడం, రిటైర్మెంట్ వంటి లక్ష్యాలు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా, ఎంత కాలం పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు అనే విషయంపై ఆధారపడి సరైన ఫండ్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఫండ్ గురించి సరిగా పరిశోధించకపోవడం ఎటువంటి పరిశోధన లేకండా చేయకుండా, ఎవరో చెప్పారని, గతంలో మంచి రాబడులు వచ్చాయని ఒక ఫండ్‌ ఎంచుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా ప్రమాదం. . ఫండ్ గత పని తీరు, లక్ష్యాలు, నిర్వహణ టీమ్, ఖర్చుల నిష్పత్తి వంటివి క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ ప్రొఫైల్‌కి సరిపోయే ఫండ్‌ ఎంచుకోవాలి.మార్కెట్‌ను టైమ్ చేయడానికి ప్రయత్నించడంమార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని అంచనా వేయడం, ఆ సమయానికి తగినట్లు స్టాక్స్ కొనుగోలు చేయడం, అమ్మడం (మార్కెట్ టైమింగ్) అనేది చాలా కష్టం. అనుభవజ్ఞులైన నిపుణులకు సైతం సాధ్యం కాదు. భావోద్వేగాలతో తొందరపడి తీసుకునే నిర్ణయాలు నష్టాలను మిగులుస్తాయి. క్రమశిక్షణతో కూడిన సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్ హెచ్చు తగ్గులకు లోను కాకుండా మంచి రాబడులు అందుకోవచ్చు. గత పని తీరును చూసి పెట్టుబడి పెట్టడంఏదైనా ఫండ్ గతంలో మంచి రాబడులు అందించిందని మాత్రమే చూసి,పెట్టుబడి పెట్టడం సాధారణంగా ఇన్వెస్టర్లు చేస్తున్న తప్పు. గత పని తీరు భవిష్యత్ రాబడులకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. మార్కెట్ పరిస్థితులు ఎప్పుడైనా మారవచ్చు. ఒక ఫండ్ స్థిరమైన పని తీరును వివిధ మార్కెట్ సైకిల్స్‌లో ఎలా ఉంది, దాని పెట్టుబడి వ్యూహం ఏంటి అని పరిశీలించి తీసుకోవాలి.డైవర్సిఫికేషన్ చేయకపోవడం మీ పెట్టుబడుల్లో డైవర్సిఫికేషన్ ఉండాలి. అంటే వివిధ రంగాలకు చెందిన ఫండ్లలో పంచడం ద్వారా రిస్క్‌ తగ్గించుకోవచ్చు. అయితే, అతిగా డైవర్సిఫై చేయడమూ మీ పోర్ట్‌ఫోలియోను నిర్వహించడం కష్టమవుతుంది. రాబడులు తగ్గిస్తుంది. ఒకే ఫండ్‌లో ఎక్కువగా పెట్టుబడి పెట్టకుండా, ఎక్కువ ఫండ్లలో పెట్టుబడి పెట్టకుండా సరైన బ్యాలెన్స్ పాటించాలి.అధిక ఖర్చుల నిష్పత్తిని విస్మరించడంమ్యూచువల్ ఫండ్ల నిర్వహణ కోసం కొంత రుసుమును ఉంటాయి. దీనినే ఎక్స్‌పెన్స్ రేషియో అంటారు. ఇది మీ రాబడులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అధిక ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్లు దీర్ఘకాలంలో మీ రాబడులను తగ్గిస్తాయి. ఒకే రకమైన ఫండ్లను పోల్చి చూసేటప్పుడు, తక్కువ ఖర్చుల నిష్పత్తి ఉన్నవాటిని ఎంచుకోవడం మంచిది.మ్యూచువల్ ఫండ్లలో తెలివిగా పెట్టుబడి పెట్టాలి. అందుకు సరైన ప్రణాళిక, పరిశోధన, క్రమశిక్షణ అవసరం. ఈ సాధారణ తప్పులను నివారించడం వల్ల మీ ఆర్థిక లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోవచ్చు.