ఆటోడ్రైవర్ తన పర్స్ నుంచి డబ్బు దొంగిలించేందుకు యత్నించాడని ఓ మహిళ ఆరోపించిన ఘటన దేశ ఐటీ రాజధాని నగరం బెంగళూరులో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ డిజైనర్, మోడల్ అయిన జాహ్నవి క్షత్రియాస్ ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. జరిగిన కొద్ది గంటల్లోనే ఇది చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, జాహ్నవి క్షత్రియాస్ తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వివరించారు. ‘‘తాను మారతహళ్లి నుంచి జేపీ నగర్ ఏడో ఫేజ్‌కు రాపిడో ఆటో బుక్ చేసుకున్నాను. ప్రయాణ సమయంలో డ్రైవర్ రివ్యూ మిర్రర్‌లో నిరంతరం నన్నే చూస్తూ ఉండటంతో అసౌకర్యంగా అనిపించింది. వెంటనే నా ఫ్రెండ్‌కు స్నాప్‌చాట్ ద్వారా సమాచారం ఇచ్చాను... అదే సమయంలో నా ఫోన్ బ్యాటరీ తగ్గిపోతోందని చెప్పి ముందుగా డబ్బులు చెల్లించేందుకు డ్రైవర్‌ను కోరితే అతడు ఒప్పుకున్నాడు... రాత్రి 9.40 గంటలకు ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉండగా.. మా అమ్మ కాల్ చేసి కాఫీ పౌడర్ తీసుకురావాలని చెప్పారు. ఆటో ఆపించి, దుకాణానికి వెళ్లి తిరిగి బయటకు వచ్చేసరికి ఆటోడ్రైవర్ హ్యాండ్‌బ్యాగ్ ముందున్న జిప్ తెరవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూశాను’’ అని తెలిపారు.‘‘జిప్‌లో డబ్బులు ఇరుక్కుపోవడంతో వాటిని తీసేందుకు కష్టపడుతున్నాడు. నేను ఆ వెనుక నిలబడినప్పటికీ, డ్రైవర్ అది గమనించలేదు.. దీనిపై నిలదీయడంతో షాకయ్యాడు.. తాను డబ్బు దొంగతం చేయడం లేదని.. బయటకు కనిపిస్తోన్న బ్యాగ్‌ను లోపలి పెట్టేందుకు ప్రయత్నించా’ అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, ఆ పక్కనే ఉన్న మరో అమ్మాయిను దొంగగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ, అతడు అడ్డంగా దొరికిపోయాడు... ’’ అని ఆమె అన్నారు.‘‘ఇది కేవలం డబ్బు దొంగతనం కాదు. ఇది మనకు ఉన్న నమ్మకాన్ని, భద్రతను, మహిళగా ఉన్న గౌరవాన్ని బలితీసుకునే చర్య,.. నేను సమయానికి అక్కడకు రాకపోయుంటే ఏమై ఉండేదో ఊహించడానికే భయమేస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. రాపిడో అధికారికులకు ఈ విషయంపై ఫిర్యాదుచేసిన ఆమె.. డ్రైవర్‌‌పై చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల భద్రత విషయంలో మరింతగా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఆటో నంబర్, ప్రాంతం, సమయం వంటి వివరాలను కూడా పోస్టులో స్పష్టంగా పొందుపరిచారు. విషయం తెలిసిందే. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘మీరు వీడియో తీశారు అంటే బాగుంది, మీరు సురక్షితంగా ఉండటం ఆనందంగా ఉంది!’ అని ఒకరు.. ‘ఇంత సీరియస్ విషయాన్ని చాలా సరైన విధంగా తెలియజేసిన ఉత్తమ వీడియోల్లో ఒకటి’ అని మరొకరు ఇలా జాహ్నవికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. తనకు ఎదురైన అనుభవంపై నిర్భయంగా పోరాడారని ప్రశంసిస్తున్నారు. అయితే, విధించిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై రాపిడో స్పందింది. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది. సంబంధిత డ్రైవర్ (కెప్టెన్) బాధ్యతా రహిత ప్రవర్తనపై క్షమాపణ తెలిపింది. అంతేకాదు, అతడిపై కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చింది.