ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. బౌలర్ల ఆధిపత్యం కొనసాగుతున్న ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో 14 వికెట్ల పడగా.. రెండో రోజు సైతం అదే సంఖ్యలో వికెట్లను బౌలర్లు దక్కించుకున్నారు. దీంతో మ్యాచ్ మూడో రోజే ముగిసేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం . ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 144/8తో ఉంది. ఆసీస్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది.కమిన్స్ ధాటికి ప్రొటీస్ బేజారు..ఓవర్ నైట్ స్కోరు 43/4తో రెండో రోజు ఆట ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. కెప్టెన్ బవుమా (36), బెండిగ్‌హామ్ (45) రాణించడంతో కోలుకుంది. ఓ దశలో 94/4తో నిలిచి మెరుగ్గా కనిపించింది. కానీ కమిన్స్ రాకతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కకావికలమైంది. తొలి రోజు ఆటలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కమిన్స్.. రెండో రోజు మాత్రం నిప్పులు చెరిగే బంతులతో చెలరేగాడు. రెండో రోజు దక్షిణాఫ్రికా కోల్పోయిన 6 వికెట్లలో ఐదు కమిన్స్ ఖాతాలోనే పడటం గమనార్హం. దీంతో అనుకున్న దాని కంటే తక్కువ స్కోరుకే ప్రొటీస్ పరిమితమైంది. 138 పరుగులకు ఆలౌట్ అయింది.పటిష్ట స్థితిలో ఆస్ట్రేలియా..తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 74 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. 28/0తో నిలిచి.. లీడ్‌ను వంద పరుగుల మార్కును దాటించింది. కానీ ఆ తర్వాత ఆ జట్టు తీవ్రంగా తడబడింది. లుంగీ ఎంగిడి, రబాడ విజృంభించడంతో కేవలం 45 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయింది. 73/7తో నిలిచింది. దీంతో ఆసీస్ కనీసం వంద రన్స్ అయినా చేస్తుందా? అనే అనుమానం తలెత్తింది. కానీ స్టార్క్ (47 బంతుల్లో 16 నాటౌట్), అలెక్స్ కేరీ (43) జోడీ 8వ వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి.. ఆధిక్యాన్ని 200 పరుగులు దాటించింది. ఆట చివరకు 144/8తో నిలిచిన ఆసీస్.. ఆధిక్యాన్ని 218 పరుగులకు పెంచుకుంది.అయితే పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, హేజిల్‌వుడ్‌ను తట్టుకుని గెలవాలంటే దక్షిణాఫ్రికా బ్యాటర్లు అద్భుతం చేయాల్సిందే. మొత్తంగా మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ ఫలితం మూడో రోజే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. .. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాను గెలిపిస్తాడేమో చూడాలి.బవుమా vs హేజిల్‌వుడ్.. ఎవరి రికార్డ్ పదిలం?ఇప్పటి వరకూ సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాకు టెస్టుల్లో ఓటమి అనేదే తెలీదు. అతడి సారథ్యంలో 9 టెస్టులు ఆడిన సఫారీలు 8 విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోవైపు ఆస్ట్రేలియా పేసర్ . అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫలితం తర్వాత వీరిద్దరిలో ఒకరి రికార్డు మాత్రమే పదిలంగా ఉండే అవకాశం ఉంది.