ఇంగ్లండ్ క్లీన్ స్వీప్.. ఓపెనర్లు ఊచకోత! ఆఖరి టీ20లో 200 బాదినా విండీస్ ఓటమే!

Wait 5 sec.

సొంత గడ్డపై వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. విండీస్ ప్లేయర్లు పోరాడినా మూడు మ్యాచ్‌లలో ఓటమి తప్పలేదు. రోజ్ బౌల్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు 37 పరుగుల భారీ ఆధిక్యంతో విజయం సాధించింది. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన నామమాత్రపు మూడో టీ20లో ఇరు జట్లు భారీ స్కోర్ చేశాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. ఓపెనర్లు జెమీ స్మిత్, విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 8.5 ఓవర్లలోనే ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పరు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాకబ్ బేతెల్ ఆఖర్లో బౌండరీల వర్షం కురిపించడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. జెమీ స్మిత్ 26 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 60 పరుగులు చేయగా, బెన్ డకెట్ 46 బంతుల్లో పది ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 పరుగులు బాదాడు. 10 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 22 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆఖర్లో కెప్టెన్ హ్యారీ బ్రూక్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35, జాకబ్ బేతెల్ 16 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ అందించిన 249 పరుగుల లక్ష్య ఛేదనలో విండీస్ కూడా పోరాడింది. ఓపెనర్లు లూయిస్, ఛార్లెస్ విఫలమైనప్పటికీ కెప్టెన్ హోప్ 27 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 45 పరుగులు, షిమ్రోన్ హెట్మెయర్ 8 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 26 పరుగులు చేశారు. భారీ రన్‌రేట్‌తో ఆడినప్పటికీ వీరిద్దరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. రూథర్ ఫోర్డ్ (1), రొమారియో ఫెఫర్డ్ (0) విఫలమవ్వడం విండీస్‌ను నష్టం చేకూర్చింది. రొవ్‌మన్ పావెల్ ఒంటి చేత్తో ఆఖర్లో పోరాడాడు. 45 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జేసన్ హోల్డర్ 12 బంతుల్లో మూడు సిక్సర్లతో 25 పరుగులు చేయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మూడు మ్యాచ్‌లలో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఆఖరి టీ20లో రాణించిన బెన్ డకెట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా, ఓవరాల్‌గా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన జోస్ బట్లర్‌కి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.