దారుణమైన స్థితిలో కోటా శ్రీనివాసరావు.. ఓ కాలి వేళ్లు తీసేశారు.. ఇంకో కాలికి కట్లు..

Wait 5 sec.

తెలుగు సినీ చరిత్రలో అన్ని రకాల పాత్రల్లో నటించగలిగే ఆల్‌రౌండర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటివారిలో ముందు వరుసలో ఉంటారు కోట శ్రీనివాసరావు. విలన్‌గా, కమెడియన్‌గా, సహాయక పాత్రల్లో కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్నారు. 78 ఏళ్ల చాలాకాలంగా సినిమాల్లో నటించడం లేదు. వయసు మీద పడటం, తరుచూ అనారోగ్యానికి గురికావడంతో ఆయన సినీ ఇండస్ట్రీకి దూరమై ఇంటికే పరిమితమయ్యారు. * తాజాగా సినీ నిర్మాత, నటుడు కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ ఫోటోలలో కోట శ్రీనివాసరావు కాస్త బక్కచిక్కి, గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపిస్తున్నారు. ఆయన కాళ్లని గమనిస్తే.. ఓ కాలికి వేళ్లు తీసేశారు. ఇంకో కాలికి కట్టు ఉంది. పైగా కాళ్లు రెండు చాలా నల్లగా కనిపిస్తుండటంతో ఆయన్ని చూసి సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలో అందరితోనూ ఆప్యాయంగా ఉండే బండ్ల గణేష్.. పెద్దాయన్ని కలవడం పట్ల ఆయన్ని అభినందిస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఆరోగ్యంపై ఇటీవల కొన్ని పుకార్లు రాగా వాటిని ఆయన ఖండించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కాళ్ల నొప్పులు,, సాధారణ వృద్ధాప్య సమస్యలు తప్ప తనకెలాంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. * కృష్ణా జిల్లా నూజివీడులో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండు రోజులకి అంటే 1947 ఆగస్టు 17న జన్మించారు కోట శ్రీనివాసరావు. నాటక రంగం నుంచి ప్రస్థానం మొదలుపెట్టిన కోట.. 1978లో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'తోనే నటుడిగా కెరీర్ ప్రారంభించారు. అక్కడి నుంచి వందల కొద్ది సినిమాల్లో విలన్, సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. కోట శ్రీనివాసరావు ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికం... ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు అపారమైనవి. కోట శ్రీనివాసరావు పేరు తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో అతిశయోక్తి ఉండదేమో.. *