భారీగా తగ్గి ఇప్పుడు ఇలా.. ఈరోజు బంగారం ధరలు ఇవే.. తులం రేటు ఎంతుందంటే?

Wait 5 sec.

Gold Rate Today: మన దేశంలో బంగారానికి ఏడాది పొడవున గిరాకీ ఉంటుంది. దీంతో టన్నుల కొద్ది విదేశాల నుంచి దిగుమతి అవుతుంటుంది. భారతీయులకు బంగారం అంటే అంత ఇష్టం మరి. పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, పర్వదినాలు అంటూ సందర్భాలను బట్టి బంగారం కొనుగోళ్లు చేస్తుంటారు. ముఖ్యంగా మహిళలు బంగారం ఆభరణాలు కొత్త కొత్త డిజైన్లలో ధరించేందుకు ఇష్టపడతారు. దీంతో క్రయ విక్రయాలు భారీగా జరుగుతుంటాయి. అయితే, ఈ ఏడాదిలో విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. తులం బంగారం రేటు లక్ష మార్క్ వైపు దూసుకెళ్తోంది. కానీ, దీంతో చాలా మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుని సిద్ధమయ్యారు. అయితే, వారందరికీ సడెన్ షాకిచ్చాయి ధరలు. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగానే పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే ఔన్స్ బంగారం ధర 40 డాలర్లకు పైగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3373 డాలర్ల పైన ట్రేడవుతోంది. అలాగే స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 36.37 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. ఇండియన్ రూపాయి మారకం విలువ కాస్త పుంజకుంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూ. 85.490 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరగత నాలుగు రోజుల్లో రూ.2000 పైన తగ్గిన 24 క్యారెట్ల పసిడి ధర ఇవాళ ఒక్క రోజే రూ.820 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన గోల్డ్ రేటు రూ. 98 వేల 400 వద్దకు ఎగబాకింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఒక్కరోజే రూ.750 మేర పెరిగింది. దీంతో తులం ఆభరణాల బంగారం రేటు రూ. 90 వేల 200 మార్క్ చేరింది. స్థిరంగా వెండి ధర.. బంగారం ధరను మించి వెండి రేటు పరుగులు పెడుతోంది. హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర క్రితం రోజు రూ.1000 పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో కిలో ధర రూ. 1,19,000 వద్దకు చేరింది. ఇవాళ ఏ మార్పు లేకుండా అదే ధర వద్ద కొనసాగుతోంది. ఈ కథనంలో పేర్కొన్న బంగారం, వెండి రేట్లు జూన్ 12, 2025 గురువారం రోజున ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. అలాగే జీఎస్టీ, ఇతర పన్నులు కలిపితే ప్రాంతాలను బట్టి బంగారం ధరలు మారుతుంటాయి. అందుకే మీరు కొనుగోలు చేసే ముందే స్థానిక జువెలర్స్ వద్ద ధరలు తెలుసుకోవడం మంచిది.