చాలా రసవత్తరంగా సాగుతోంది. ది గ్రేట్ లార్డ్స్ మైదానం వేదికగా . తొలి రోజు పిచ్ బౌలర్లకు బాగా అనుకూలించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా బౌలింగ్ ఎంచుకోవడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చింది. రబడా, మార్కో యాన్సన్ దెబ్బకు ఆస్ట్రేలియా తక్కువ పరుగులకే ఆలౌట్ అయింది. తొలి రోజే బ్యాటింగ్‌కి వచ్చిన సౌతాఫ్రికా వెంటవెంటనే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు లార్డ్స్ పిచ్‌పై ఆచితూచి ఆడింది. మొదటి పరుగు తీయడానికి ఆ జట్టు చాలా ఓవర్లు ఆడాల్సి వచ్చింది. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి పరుగులు ఏమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాడు. మార్నస్ లబుషేన్ స్కోర్ బోర్డును ముందు నడిపించినా 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కామెరూన్ గ్రీన్ ఇలా వచ్చి అలా అవుటయ్యాడు. ట్రావిస్ హెడ్ కూడా నిరాశ పరిచాడు. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును స్టీవ్ స్మిత్, వెబ్ స్టర్ భాగస్వామ్యం నిలబెట్టింది. స్టీవ్ స్మిత్ 66 పరుగులు చేసి అవుటవ్వగా, వెబ్ స్టర్ 72 పరుగులతో ఆసీస్ స్కోర్ 200 దాటేలా చేశాడు. అలెక్స్ క్యారీ 23 పరుగులతో అవుటవ్వగా.. మిగతా వాళ్లంతా 1, 0 పరుగులకు పెవిలియన్ బాట పట్టారు. దాంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబడా ఐదు వికెట్లు తీసుకోగా, మార్కో యాన్సన్‌‌కి మూడు వికెట్లు దక్కాయి. మహారాజ్, మర్కరమ్‌కు చెరొక వికెట్ పడగొట్టారు. తొలి రోజే బ్యాటింగ్‌కి వచ్చిన సౌతాఫ్రికా టీమ్‌కు ఆసీస్ పేసర్ల సత్తా ఏంటో చూయించారు. మిచెల్ స్టార్క్ తన స్వింగ్‌తో సఫారీలను ముప్పుతిప్పలు పెట్టగా, హేజెల్‌వుడ్, కమిన్స్ బౌన్సర్లతో బెంబేలెత్తించారు. ఎయిడెన్ మర్కరమ్ తొలి ఓవర్‌లోనే స్టార్క్ బౌలింగ్‌లో బ్యాట్ ఎడ్జి తగిలి బౌల్డ్ అవగా, ర్యాన్ రికెల్టన్ క్యాచ్ రూపంలో పెవిలియన్‌కు వెళ్లాడు. ముల్డర్‌ను కమిన్స్ బౌల్డ్ చేయగా, ట్రిస్టన్ స్టబ్స్‌ వికెట్లను హేజెల్‌వుడ్ హిట్ చేశాడు. మర్కరమ్ 0, రికెల్టన్ 16, ముల్డర్ 6, స్టబ్స్ 2 పరుగులే చేయడంతో 30కే నాలుగు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టెంబా బవుమా (3), బెడింగ్‌హామ్ (8) మరో వికెట్ పడకుండా కాపాడారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 43 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది.