UPI Payments: దేశీయ డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)తో అగ్రస్థానం. డిజిటల్ ట్రాన్సాక్షన్లలో 83 శాతం మేర ఉన్నాయి. ఈ క్రమంలో యూపీఐ పేమెంట్ల వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) చర్యలు చేపడుతోంది. ఈ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు, యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకునే సంఖ్యపై పరిమితులు విధించింది. ఈ నేపథ్యంలోనే రూ.3 వేలకు మించి జరిపే అయితే, తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఎండీఆర్‌ ఛార్జీలు ప్రభుత్వం 2020, జనవరిలోనే రద్దు చేసింది. ఆ తర్వాత ఈ ట్రాన్సాక్షన్లు గణనీయంగా పెరిగాయి. ఇందుకు అవసరమైన సాంకేతికత, ఇతర సిస్టమ్స్ కోసం బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ పెట్టుబడులు పెంచాల్సి వస్తోంది. ఇక నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నెట్‌వర్క్ ద్వారా పని చేసే రూపే కార్డులపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.2 వేలు దాటిన ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI) యూపీఐ ట్రాన్సాక్షన్లపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీ వర్తిస్తోంది. యూపీఐ ట్రాన్సాక్షన్లపై ప్రజల నుంచి ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం రూ.1500 కోట్లు అందిస్తోంది. ఇప్పుడు ట్రాన్సాక్షన్లు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం సరిపోవడం లేదు. కనీసం రూ.10 వేల కోట్లు అవసరమైని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రూ.3 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై తాజా ఊహాగానాలు వచ్చాయి. అయితే, అలాంటి ఛార్జీలు ఏమీ వసూలు చేయడం లేదని ఆర్థిక శాఖ తేల్చేసింది. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయాలనే ఆలోచన లేదని పేర్కొంది. అసలు ఈ ఎండీఆర్ అంటే ఏంటి?క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ వంటి వ్యవస్థల ద్వారా పేమెంట్లు అందుకునే వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఫీ వసూలు చేస్తుంటాయి. వాటినే మర్చంట్ డిస్కౌంట్ రేట్‌గా పిలుస్తారు. ట్రాన్సాక్షన్ విలువ ప్రకారం ఈ ఫీజు మారుతుంటుంది. ట్రాన్సాక్షన్లు సురక్షితగా, వేగంగా పూర్తి చేసేందుకు సర్వర్లు, సాఫ్ట్‌వేర్, రక్షణ వ్యవస్థల నిర్వహణకు ఈ ఫీజులు ఉపయోగపడతాయి. బ్యాంకులు, పేమెంట్ ప్రొవైడర్లకు ఈ ఫీ ఆదాయ వనరు అని చెప్పవచ్చు. ఒక వ్యాపారి రూ.10 వేలు యూపీఐ ద్వారా అందుకుంటే ఎండీఆర్ 0.3 శాతం అంటే రూ.30 ఫీ వర్తిస్తుంది. వ్యాపారికి రూ.9,970 వెళ్తుంది. ఎండీఆర్ వసూలు చేసే రూ.30 బ్యాంకులు, కార్డ్ నెట్ వర్క్స్, యూపీఐ ప్లాట్ ఫామ్స్ పంచుకుంటాయి.