తెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో జోరుగా వానలు

Wait 5 sec.

తెలంగాణకు హైదరాబాద్ చేసింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురువనున్నాయని వెల్లడించింది. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట,జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలతో తోడు దక్షిణ ఒడిశా వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ మేఘావృతమైన వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు. నగరంలో సాయంత్రం తర్వాత వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు.. గతేడాది (2024) , వర్షాల విరామ కాలాలు ఎక్కువగా నమోదవడం వల్ల వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తాయని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీనివల్ల ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఈ సంవత్సరం తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని IMD అంచనా వేస్తోంది. ముఖ్యంగా జూన్ 20 -26 వరకు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ముఖ్యంగా ఉరుములు, మెరుపుల సమయంలో ఆరు బయట ఉండకుండా సురక్షిత ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని చెబుతున్నారు. ఈదురు గాలుల వల్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.