ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. ఆ ఐదు నియోజకవర్గాలు కలిపి, కీలక ప్రకటన

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త జిల్లా ఏర్పాటుకాబోతోంది.. ఈ మేరకు స్వయంగా రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు కూటమి హామీ ఇచ్చిందని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం.. మార్కాపురం జిల్లాను తీసుకొని వస్తామన్నారు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి. కూటమి ప్రభుత్వం కు కట్టుబడి ఉంది అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రకాశం జిల్లాలో రూ.165 కోట్లతో సీసీ రోడ్ల, మురుగు కాలువలు నిర్మించామన్నారు. అలాగే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి కీలకమైన వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా.. ఈ మేరకు తూర్పు ప్రకాశం ప్రాంతానికి రెండో విడత కింద తాగునీరందించాలి అన్నారు.2024 ఎన్నికల సమయంలో ను ఏర్పాటు చేస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. మార్కాపురం ఎన్నికల ప్రచార సమయంలో జిల్లా అంశంపై హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు సందర్భాల్లో కొత్త జిల్లా ఏర్పాటు అంశం ప్రస్తావనకు వచ్చింది. కొత్త జిల్లా ఏర్పాటు సాధ్యాలపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు పశ్చిమ ప్రకాశం ప్రజల దాహార్తిని తీర్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.1,290 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మార్కాపురంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, కొండపి, కందుకూరు నియోజకవర్గాల పరిధిలోని 31 మండలాల్లోని 1,387 గ్రామాలకు తాగునీటి సమస్య తీరనుంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు పవన్ కళ్యాణ్. పశ్చిమ ప్రకాశం ప్రజల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుందన్నారు. తాగునీటి ఇబ్బందులను గుర్తించామని.. ప్రజల దాహార్తిని తీర్చేందుకు జలజీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు.. ఎంతోమంది మహానుభావులు పుట్టిన ప్రకాశం జిల్లా ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. వెలిగొండ ప్రాజెక్టును గత ప్రభుత్వం పూర్తి చేయలేదని.. ఎన్నికల ముందు శిలాఫలకం వేసి ప్రజలను మోసం చేశారన్నారు. నిర్వాసితులకు పరిహారం కూడా ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు పూర్తయితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. వలసలు ఆగిపోయి, సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లా సాకారమవుతుందన్నారు. మార్కాపురం లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం భూములను ఆక్రమించిన వారి తరతరాలు కూడా మిగలకుండా పోతాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఆలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను తీసుకుంటుందన్నారు.