Gold Rate Today: ఎప్పటికప్పుడు మీరుతుంటాయి. చాలా రకాల అంశాలు పసిడి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ముఖ్యంగా అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో మార్పులు దేశీయంగా బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి. అలాగే అమెరికా డాలర్ విలువ, రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ భౌగోళిక అంశాలు, దేశయా మధ్య యుద్ధాలు అంటే చాలా అంశాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన బంగారం ధరలు భారీగా పెరిగేందుకు కారణమైన సంగతి తెలిసింది. అయితే, ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గిన క్రమంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఇవాళ ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3336 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజుతో పోలిస్తే 3 డాలర్లు పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 36.93 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణుగుతున్న క్రమంలో పసిడి ధరలు దిగివస్తున్నాయని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 600 మేర తగ్గింది. దీంతో తులం ధర రూ. 98 వేల 730 స్థాయికి దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ. 550 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 90 వేల 500 వద్దకు దిగివచ్చింది. రూ.1000 తగ్గిన వెండి రేటుబంగారంతో పోటీపడుతు పరుగులు పెడుతున్న వెండి కాస్త ఉపశమనం కల్పించింది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ వెండి రేటు రూ. 1000 మేర తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,20,000 వద్దకు తగ్గింది.పైన పేర్కొన్న పసిడి ధరలు జూలై 5వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే ధరలు మధ్యాహ్నానికి మారుతుంటాయి. అలాగే జీఎస్టీ వంటి ట్యాక్సులు కలిపితే ప్రాంతాలను బట్టి బంగారం, వేరు వేరుగా ఉంటాయి. అందుకే కొనుగోలు చేసే ముందే స్థానికంగా ఉండే జువెలర్స్ వద్ద బంగారం, వెండి ధరలు తెలుకోవడం మంచిది.