ఏపీలో పేదలకు పండగే.. శ్రావణమాసంలో పక్కా, రూ.లక్ష నుంచి రూ.50 వేలు ఇస్తున్నారు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. వచ్చే శ్రావణ మాసంలో పేదలకు గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల ఇళ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది.. వాస్తవానికి ఉగాదికి భావించినా సాధ్యపడలేదు. అందుకే శ్రావణమాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. గత 13 నెలల్లో 2.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.. 1.2 లక్షల ఇళ్లు లింటెల్ స్థాయిలో, 87,000 ఇళ్లు రూఫ్ స్థాయిలో, 50,000 ఇళ్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు.కేంద్రం సంబంధించి ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు ఇస్తోంది. ఉపాధి హామీ పథకం కింద మరో రూ.30 వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపట్టణ ప్రాంతాల్లో అదనంగా రూ.30 వేలు చెల్లిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులకు రూ.లక్ష , ఎస్టీలకు రూ.75 వేలు, బీసీలకు రూ.50వేలు, ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు అదనంగా సాయంగా అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు రూ.300 కోట్ల వరకు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 50 వేల మంది ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందించినా మిగిలిన వారిలో 50వేల మంది ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదో తెలుసుకోవడానికి అధికారులు సమాచారం తీసుకుంటున్నారు.విత్తన పంపిణీపై మార్గదర్శకాలుఏపీ ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తన పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 'డి-క్రిషి యాప్‌ ద్వారా రైతులకు విత్తనాలు అందించాలని పేర్కొంది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నుంచి రైతు సేవా కేంద్రాల వారీగా కేటాయింపులుంటాయని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయించిన రాయితీ మేరకు.. అక్కడి వ్యవసాయ/ఉద్యాన సహాయకులు విత్తనాలను పంపిణీ చేస్తారు. ఆధార్, మొబైల్‌ నంబరుకు ఓటీపీ ధ్రువీకరణ ద్వారా రైతుల్ని గుర్తిస్తారు. రాయితీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని వసూలు చేసి, అదే రోజు విత్తనాలు పంపిణీ చేస్తారు' అని తెలిపారు. ఆ స్కూళ్లకు నిధులు విడుదలరాష్ట్రంలోని 855 పీఎంశ్రీ పాఠశాలలకు నిర్వహణ నిధులను విడుదల చేస్తూ సమగ్ర శిక్షా అభియాన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి విడతగా 50% నిధులు ఇచ్చింది. విద్యార్థుల సంఖ్య వంద కంటే తక్కువగా ఉంటే రూ.4.75లక్షలు, 250 వరకు ఉంటే రూ.17.62లక్షలు, వెయ్యి వరకు ఉంటే రూ.36.8లక్షలు, వెయ్యి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే రూ.39లక్షల చొప్పున విడుదల చేసింది.