ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడుతూ వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతోంది. పెరుగుతున్న వాహనాల సంఖ్య, రద్దీగా ఉండే జంక్షన్లు నిత్యం వాహనదారులకు, పాదచారులకు సవాళ్లను విసురుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. నగరంలో , రహదారుల నిర్మాణాలతో పాటు, పై దృష్టి సారించింది.తాజాగా నగరంలో మరో స్కై్వాక్ అందుబాటులోకి రానుంది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో జేఎన్‌టీయూ ఒకటి. ఈ మార్గంలో రోజుకు లక్షన్నరకు పైగా వాహనాలు ఇక్కడి నలువైపులా రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రద్దీ మధ్య నిత్యం వేలాది మంది పాదచారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రోడ్డు దాటుతుంటారు. వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని గాయాలపాలవడం, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా గతంలో చోటుచేసుకున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా, జేఎన్‌టీయూ జంక్షన్‌లో అతి పెద్ద స్కైవాక్ నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) ప్రణాళిక సిద్ధం చేసింది. తరహాలోనే ఇది కూడా ఉంటుంది. మెట్రో స్టేషన్, ప్రగతినగర్ రోడ్డు, జేఎన్‌టీయూ బస్‌స్టేషన్, లూలూమాల్ వైపుల నుంచి పాదచారులు సులువుగా రోడ్డు దాటేలా ఈ స్కైవాక్ రూపొందించబడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఒక కన్సల్టెన్సీని నియమించి, అధ్యయనం తర్వాత పనులను చేపట్టనున్నారు. ఈ సంవత్సరంలోనే పనులకు శ్రీకారం చుట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జేఎన్‌టీయూ స్కైవాక్ నిర్మాణం పూర్తయితే పాదచారుల భద్రతకు, ట్రాఫిక్ సమస్యకు చెక్ పడనుంది. జేఎన్‌టీయూ స్కైవాక్‌తో పాటు, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి HMDA, GHMC అనేక ఇతర ప్రాజెక్టులను చేపడుతున్నాయి. వీటిలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, విస్తరించిన రహదారులు, ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థల ఆధునీకరణ ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే నగర వాసులు ఎలాంటి టెన్షన్ లేకుండా మరింత సురక్షితమైన, సులభమైన ప్రయాణ అనుభూతిని పొందనున్నారు.