సినీ నటుడు విజయ్ దేవరకొండకు బిగ్ షాక్.. SC, ST అట్రాసిటీ కేసు..

Wait 5 sec.

తెలుగు సినీ పరిశ్రమలో యువతను ఆకట్టుకుంటున్న మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జరిగిన ‘రెట్రో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలు తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దీని పర్యవసానంగా.. రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. విజయ్ దేవరకొండ తమిళ హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఆడియో వేడుకలో మాట్లాడిన మాటలే ఈ వివాదానికి మూల కారణం. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో.. పాతకాలంలో గిరిజన తెగలు కొట్లాడుకున్నట్టే, ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ దేశాలు కొట్లాడుకుంటున్నాయి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను మాట్లాడిన మాటలు గిరిజనులను, వారి చారిత్రక నేపథ్యాన్ని అవమానించేలా ఉన్నాయని ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్‌రాజ్ చౌహాన్ సహా పలు గిరిజన సంఘాలు తప్పుబట్టాయి. ఆదివాసీ సమాజానికి వేల సంవత్సరాల గొప్ప చరిత్ర, విభిన్న సంస్కృతులు, ప్రత్యేక జీవనశైలి, పర్యావరణ పరిరక్షణలో విశేషమైన పాత్ర ఉంది. కేవలం కొన్ని తెగల మధ్య జరిగిన అంతర్గత ఘర్షణలను ఆధునిక దేశాల సైనిక ఘర్షణలతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, ఇది వారిని అనాగరికులుగా చిత్రీకరించడమేనని గిరిజన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాదరణ పొందిన నటులు మాట్లాడేటప్పుడు వాస్తవాలను పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయ్ దేవరకొండ వ్యాఖ్యలపై ఆదివాసీ, గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. చాలా చోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే రాయదుర్గం పోలీసులు విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ చట్టం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సభ్యుల పట్ల వివక్ష, అవమానాలను నిరోధించడానికి ఉద్దేశించబడింది. ఇది వారి హక్కులను, గౌరవాన్ని కాపాడుతుంది.నిజానికి.. విజయ్ దేవరకొండ తన వ్యాఖ్యలపై అప్పుడే సోషల్ మీడియా వేదికల ద్వారా వివరణ ఇచ్చారు. ‘వందల ఏళ్ల క్రితం రెండు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు, గొడవలు చోటు చేసుకునేవి. ఆ ఉద్దేశ్యంతోనే ‘ట్రైబ్స్’ అనే పదం వాడాను. ఇప్పుడున్న షెడ్యూల్డ్ ట్రైబ్‌ని ఉద్దేశించి నేను ఈ వ్యాఖ్యలు చేయలేదు. అయినా కూడా నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ఎవరైనా బాధపడితే అందుకు నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను’ అని ఆయన అన్నారు. క్షమాపణ చెప్పినప్పటికీ కేసు నమోదు కావడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు. విజయ్ దేవరకొండ ఉద్దేశ్యం, వ్యాఖ్యల ప్రభావంపై న్యాయపరమైన అంశాలను పరిశీలిస్తున్నారు.