టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి లడ్డూలు కొనడానికి ఎక్కువ సమయం పట్టేది..ఒకవేళ లడ్డూలు అదనంగా కావాలనుకునే భక్తులు, లడ్డూ విక్రయ కేంద్రంలో డబ్బులు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి చాలా సమయం పట్టేది.. కొన్నిసార్లు రద్దీ కూడా పెరిగేది.. ఇప్పుడు కియోస్క్‌ల ద్వారా లడ్డూలు కొనుగోలు చేసే విధానంతో ఇబ్బందులు తొలగిపోయాయి. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించడానికి, తిరుమలలో లడ్డూ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. భక్తులు తీసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సరికొత్త విధానం ఆదివారం ప్రారంభమైంది. దర్శనం టికెట్ నంబర్ ఎంటర్ చేసి, యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి లడ్డూలు పొందవచ్చు అని టీటీడీ తెలిపింది. టికెట్లు లేని భక్తులు ఆధార్ నంబర్ ఉపయోగించి లడ్డూలు కొనుగోలు చేయొచ్చంటున్నారు. ఈ విధానం ద్వారా భక్తులు సులభంగా లడ్డూలు పొందవచ్చు. భక్తులు తమ దర్శనం టికెట్ నంబర్‌ను కియోస్క్‌లో నమోదు చేసిన తర్వాత కావలసిన లడ్డూల సంఖ్యను ఎంచుకోవాలి. అప్పుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి.. వచ్చిన రసీదును లడ్డూ కౌంటర్‌లో ఇస్తే లడ్డూలు ఇస్తారు. 10 నుంచి 15 లడ్డూల వరకు పొందవచ్చు. లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుంది.. ఈ విధానాన్ని కొద్ది రోజులు పరిశీలిస్తారు. ఏమైనా సమస్యలు ఉంటే సరిచేస్తారు. ఈ సంఖ్యను నాలుగుకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. దర్శనం టికెట్లు లేని భక్తులు ఆధార్‌ నంబర్‌ ఎంటర్ చేసి రెండు లడ్డూలు కొనుగోలు చేయొచ్చని టీటీడీ తెలిపింది. ఈ మేరకు తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో ఐదు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం దగ్గర మరో మూడు కియోస్క్‌లు ఉన్నాయి. తిరుమలలో ఉన్న శ్రీపద్మావతి విచారణ కేంద్రం, సీఆర్వో విచారణ కేంద్రం, ప్రముఖ గెస్ట్ హౌస్‌ల దగ్గర కూడా ఈ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను కూడా కియోస్క్‌ల ద్వారా పొందే ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది. తిరుమలలో ఇప్పటికే అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు ఇవ్వడానికి కూడా కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు భక్తలు రూపాయి నుంచి రూ.99 వేల వరకు విరాళాలు ఇవ్వవచ్చు. తాజాగా కియోస్క్‌ల ద్వారా లడ్డూలను పొందే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. దీంతో భక్తులకు లడ్డూ క్యూ లైన్లలో నిలబడే ఇబ్బంది తప్పింది.