Gold Rate Today: భారతీయులకు బంగారం అంటే మక్కువ ఎక్కువ. ఎవరి స్థోమతకు తగ్గట్లుగా వారు బంగారం కొనుగోలు చేస్తుంటారు. తమ వద్ద ఎంతో కొంత బంగారం ఉండాలని కోరుకుంటారు. బంగారం ఎంత ఎక్కువగా ఉంటే అంత గౌరవంగానూ భావిస్తారు. మన దేశంలో ఏడాది పొడవునా బంగారం క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఇక పండగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల వంటి సమయాల్లో ఎక్కువగా పసిడి కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే, ఇటీవలి కాలంలో బంగారం ధర భారీగా పెరిగింది. తులం రేటు లక్ష మార్క్ దాటి పరుగులు పెడుతోంది. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంతో మరింత పెరుగుతోంది. ఇలాంటి తరుణంగా బంగారం కొనేవారికి స్వల్ప ఊరట లభించింది. జూన్ 23వ తేదీన స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3364 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 36.03 డాలర్లుగా ఉంది. మరోవైపు.. మన ఇండియన్ రూపాయి మారకం విలువ ఇవాళ స్థిరంగా ఉంది. గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూ. 86.620 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర.. క్రితం రోజు 24 క్యారెట్ల మేలిమి బంగారం తులం రేటు రూ. 270 మేర పెరిగ ఇవాళ ఎలాంటి మార్పు లేదు. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 10,0750 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు ఇవాళ ఏ మార్పు లేకుండా రూ. 92 వేల 350 వద్ద ఉంది. రెండ్రోజులుగా స్థిరంగానే వెండిహైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధర రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ ఎలాంటి మార్పు లేకుండా క్రితం రోజు ధర వద్దే ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,20,000 మార్క్ వద్ద కొనసాగుతోంది. అయితే, ముందు ముందు మరింత పెరగవచ్చని అంతా భావిస్తున్నారు. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు జూన్ 23వ తేదీ సోమవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మధ్యాహ్నం మారుతుంటాయి. ఇక పన్నులు కలిపి ధరలు లెక్కిస్తే ప్రాంతాల వారీగా వేరు వేరుగా ఉంటాయి. అందుకే కొనుగోలు చేసే ముందు స్థానికంగా ధరలు తెలుసుకోవడం మంచిది.