ఒక్కరోజులో సీన్ రివర్స్.. బంగారం ధరల్లో ఊహించని మార్పు.. ఈరోజు రేట్లు ఇవే, తులం ఎంతంటే?

Wait 5 sec.

Gold Rate Today: ధరలు తగ్గాయని సంతోషపడిన పసిడి కొనుగోలుదారులకు ఊహించని షాక్ తగిలింది. ధరల తగ్గుదల ఒక్క రోజు మురిపమే అయింది. ఎందుకంటే క్రితం రోజు భారీగా తగ్గిన పసిడి ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, చమురు ధరలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి కీలక అంశాలు పెరిగేందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావమూ బంగారం ధరలపై కనిపిస్తోంది. దీంతో అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరల పెరుగుదల కనిపిస్తోంది. క్రితం రోజు తగ్గినా మళ్లీ సీన్ రివర్స్ అయింది. ఈ క్రమలో జూన్ 22వ తేదీన హైదరాబాద్‌లో తులం బంగారం రేటు ఎంతుందో తెలుసుకుందాం. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3368 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 36.03 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక ఇండియన్ కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోల్చినప్పుడు రూ.86.620 వద్ద ఉంది. ఇది ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిగా చెప్పవచ్చు. హైదరాబాద్‌లో పెరిగిన బంగారం ధరలుక్రితం రోజు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 600 మేర తగ్గగా ఇవాళ రూ.270 మేర పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 10,0750 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై క్రితం రోజు రూ.550 మేర తగ్గగా ఇవాళ రూ.250 మేర పెరిగింది. దీంతో ఇవాళ తులం ఆభరణాల గోల్డ్ రేటు రూ. 92 వేల 350 వద్ద ఉంది. స్థిరంగానే వెండి ధరహైదరాబాద్ మార్కెట్లో బంగారంతో పోటీ పడుతూ ఆకాశమేహద్దుగా దూసుకెళ్తోన్న వెండి రేటు క్రితం రోజు భారీ ఊరట కల్పించింది. కిలో వెండి రేటు నిన్న రూ.2000 మేర తగ్గిన సంగతి తెలిసిందే. ఇవాళ ఎలాంటి మార్పు లేదు. దీంతో కిలో వెండి ధర రూ. 1,20,000 వద్ద ట్రేడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, జూన్ 22వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే. పసిడి ధరలు మధ్యాహ్నానికి మారవచ్చు. కొనుగోలు చేసే ముందే తెలుసుకుంటే మంచిది. అలాగే పన్నులు కలిపితే బంగారం ధరలు ప్రాంతాల వారీగా వేరు వేరుగా ఉంటాయి.