కుబేర ట్విట్టర్ రివ్యూ.. ధనుష్‌కు హ్యాట్సాఫ్!

Wait 5 sec.

ధనుష్, , రష్మిక ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘కుబేర’. ఈ మూవీ నేడు థియేటర్లోకి వచ్చింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా సినిమాపై బజ్‌ను పెంచాయి. ఇక ఇప్పటికే చాలా చోట్ల షోలు పడ్డాయి. దీంతో ట్విట్టర్‌లోకి టాక్ వచ్చింది. మరి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వచ్చింది? ఎవరెవరు ఏమేమీ అనుకుంటున్నారు? పాత్రకు ఎన్ని మార్కులు పడుతున్నాయి? నిజంగానే సినిమాలకే కొత్తగా ఉంటుంది? అన్నది చూద్దాం... తనకు ఈ జానర్ కొత్త అని అంతా అంటుంటేవారట. కానీ అసలు ఇది సినిమాకే కొత్త జానర్ అవుతుందని కుబేర గురించి చాలా హైప్ ఇచ్చి మాట్లాడారు. ఇక ధనుష్ అయితే శేఖర్ కమ్ముల చెప్పిన కథకు ఫిదా అయ్యారట. నాగార్జున సైతం శేఖర్ కమ్ముల చెప్పిన పాయింట్‌ నచ్చి వెంటనే ఓకే చెప్పేశారట. కథ రాయడానికి రెండేళ్లు టైం తీసుకున్న శేఖర్ కమ్ముల మరి ఇప్పుడు ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటారో చూడాలి. కుబేర ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చినట్టు అనిపిస్తోంది. ఇప్పటి వరకు సినిమా అదిరిపోయిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా, ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. ధనుష్ పర్ఫామెన్స్, నాగార్జున పాత్ర అద్భుతంగా ఉన్నాయని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. శేఖర్ కమ్ముల గొప్పగా తీశారని, చాలా సీన్లను డీఎస్పీ తన ఎలివేషన్స్‌తో పైకి లేపారని ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇప్పటి వరకు సినిమా బాగుంది.. ధనుష్ అమాయకత్వపు నటన, నాగార్జున ప్రజెన్స్ ఇవన్నీ అందరికీ కనెక్ట్ అవుతాటయ. ఇక శేఖర్ కమ్ముల హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ మాత్రం మారలేదని, ఆయన మేకింగ్, టేకింగ్ అద్భుతంగా ఉందని చెబుతున్నారు. కొంచెం నిడివి ఎక్కువ అన్న ఫీలింగ్ అయితే వస్తుందట. కానీ పూర్తిగా ఎంగేజింగ్ మోడ్‌లోనే సినిమా వెళ్తుంటుందట.ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని, అసలు ఎక్కడా కూడా ఒక్క బోరింగ్ సీన్ కూడా లేదట. ధనుష్ అద్భుతం చేశాడని, దేవీ శ్రీ ప్రసాద్ న్యాయం చేశాడని, ఫస్ట్ హాఫ్‌లోని చాలా సీన్లను డీఎస్పీ తన బీజీఎంతో పైకి లేపారని చెబుతున్నారు. అసలు ఇలాంటి పాత్రను ఒప్పుకున్న ధనుష్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అంటున్నారు.సినిమా ఇప్పుడే పూర్తయింది.. .. నాగార్జున తన పాత్రలో అవలీలగా నటించేశారు.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అద్భుతంగా రాసుకున్నారు.. రైటింగ్‌లో శేఖర్ కమ్ములకు దండం పెట్టాల్సిందే.. డీఎస్పీ డ్యూటీ చేశారు.. ఈ సారి శేఖర్ కమ్ముల అవుట్ ఆఫ్ ది పార్క్ అనేలా చేశారు.. అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇలాంటి ఓ కథను, ఇలా స్టార్లను హ్యాండిల్ చేస్తారని ఎప్పుడూ అనుకోలేదంటున్నారంతా. ఆయన రైటింగ్, డీఎస్పీ మ్యూజిక్ ఈ చిత్రానికి కనిపించని హీరోలు అని చెబుతున్నారు.. ధనుష్, రష్మికలు అయితే అద్భుతంగా సెట్ అయ్యారట.. ఈ చిత్రం తరువాత ధనుష్, రష్మిక పేర్లు మరింత ఎక్కువగా వినిపిస్తాయట. అసలు సెకండాఫ్‌లోని ఓ ఐదారు ఎమోషనల్ సీన్లకు మనం పెట్టిన డబ్బులకు సరిపడా కంటెంట్ వచ్చేస్తుందట. మిగతాది అంతా బోనస్ అని చెబుతున్నారు. చూస్తుంటే కుబేరకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చేలానే కనిపిస్తోంది. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో రానుంది.