ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Wait 5 sec.

కురుస్తాయంటోంది వాతావరణశాఖ. జార్ఖండ్‌ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది.. రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉందని తెలిపారు. అయితే గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని హెచ్చరించారు. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లొద్దని సూచించారు.'ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరిసీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. అయితే మంగళవారం కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో పడ్డాయి. అలాగే పలు జిల్లాల్లోని తీరప్రాంతాల్లో 60 కిలోమీటర్ల నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా మంగళవారం పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వానలకు రైతులు పంటల్ని నష్టపోయారు. ఏలూరు జిల్లా వేలేరుపాడులో 40 మిల్లీ మీటర్లు, విశాఖపట్నం జిల్లా భీమిలిలో 36.8, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 32.8, విశాఖపట్నంలో 29.6, ఏలూరు జిల్లా కుక్కునూరులో 28.4, అనకాపల్లిలో 28.4, ఏలూరు జిల్లా చింతలపూడిలో 27.2, విజయనగరంలో 22.4, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో 22.2, విజయనగరం జిల్లా తెర్లాంలో 21.2, ఏలూరులో 21, ఏలూరు జిల్లా భీమడోలులో 20.6, ఏలూరు జిల్లా పోలవరంలో 20.04 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో అధికారులతో కలెక్టర్లు సమీక్షలు చేశారు. గోదావరికి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ముందస్తు చర్యలపై చర్చించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలపై ఫోకస్ పెట్టారు.