తల్లికి వందనం రెండో జాబితా రెడీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేస్కోండి, ఇవాళ ఒక్కరోజే ఆ ఛాన్స్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని గత నెలలో అమలు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12 నుంచి డబ్బుల్ని విద్యార్థుల తల్లుల అకౌంట్‌లలో జమ చేసింది.. ఒక్కొక్కరికి రూ.13వేల చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. అయితే తొలి విడతలో డబ్బులు జమ కానివారు, ఒకటో తరగతిలో చేరే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రం ఈ నెల 5న అకౌంట్‌‌లలో డబ్బుల్ని జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో రెండో విడత వెరిఫికేషన్ పూర్తి చేసిన అధికారులు.. ఆ జాబితాను సిద్ధం చేశారు. ఈ లబ్ధిదారులు జాబితాలో వారి పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని సూచించారు.రెండో విడత లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో, లేదో రెండు విధాలుగా తెలుసుకోవచ్చు అంటున్నారు అధికారులు. ఈ మేరకు చెక్ చేయాలంటే.. మొదటి విధానంలో ప్రభుత్వ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.. పథకాన్ని సెలక్ట్ చేసుకుని.. విద్యార్థి తల్లి ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఈ పథకానికి అర్హులా, కాదా అన్నది తెలసిపోతుంది. రెండో విధానం విషయానికి వస్తే.. ఏపీ ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ +91 9552300009 ద్వారా తల్లికి వందనం పథకం రెండో జాబితాలో పేరు ఉందో లేదో తెలుసకోవచ్చు. అంతేకాదు ఇవాళ సాయంత్రంలోపు ఒకటో తరతగతిలో చేరే పిల్లలకు డబ్బులు అందుతాయని ప్రభుత్వం తెలిపింది.ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో తల్లిదండ్రులు, టీచర్ల మెగా సమావేశాన్ని నిర్వహించం నుంది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 10న నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. సజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికకు ఈ నెల 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. జాతీయ స్థాయిలో ఎంపిక కమిటీని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలో ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర కమిటీ ఎంపిక చేసిన జాబితాను జాతీయ స్థాయిలోని జ్యూరీకి ఆగస్టు 4 లోపు పంపుతారు. ఎంపిక చేసిన అభ్యర్థులతో జ్యూరీ ఆగస్టు 5 నుంచి 12 వరకు వీడియో కాన్ఫరెన్సు నిర్వహిస్తుంది. 13న తుది జాబితా ఎంపిక చేస్తారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ఆమోదం అనంతరం ఎంపికైన ఉపాధ్యాయులకు 14 నుంచి 20 వరకు సమాచారాన్ని అందిస్తారు. సెప్టెంబరు 4, 5న సన్నాహక ప్రక్రియ, అవార్డుల ప్రదాన కార్యక్రమాలు ఉంటాయి' అనిపాఠశాల విద్యా శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించే టీచర్లను కేంద్రమే గుర్తించి అవార్డులు అందించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు అంటున్నారు.