‘కన్నప్ప’ ఫస్ట్ రివ్యూ.. ట్రోల్ చేసిన వాళ్లు తలలెక్కడ పెట్టుకుంటారో.. బొమ్మ బ్లాక్ బస్టర్

Wait 5 sec.

పడ్డోడెప్పుడూ చెడ్డోడు కాడనే విషయం విషయంలో మరోసారి నిజం కాబోతుందా? ఇన్నాళ్లూ మంచు ఫ్యామిలీని పనికట్టుకుని ట్రోల్ చేసిన వాళ్లందరికీ ‘’తో స్లిప్పర్ షాట్ ఇవ్వబోతున్నాడా అంటే.. అవుననే వినిపిస్తుంది ఈ సినిమా ప్రివ్యూ టాక్ చూస్తుంటే. కంటెంట్ మాత్రమే ఇండస్ట్రీని ఏలుతున్న ఈ రోజుల్లో కూడా.. మంచు అనే మాట వినిపించిందంటే అదో వేస్ట్ మెటీరియల్ అనేట్టుగానే ట్రోల్ చేస్తున్నాయి కొన్ని బ్యాచ్‌లు. నిజానికి వాళ్లు ట్రోల్ చేస్తున్నారు అనేకంటే.. వీళ్లే ట్రోలింగ్ చేయించుకుంటారనేది కూడా ఒప్పుకోవాల్సిన నిజమే. మిమ్మల్ని మీరు ట్రోల్ చేయడానికి అస్సలు కష్టపడొద్దు.. మీకు కావాల్సినంత ట్రోలింగ్ కంటెంట్ మీమే ఇస్తాం అన్నట్టుగా మంచు ఫ్యామిలీలో హీరోలంతా పోటీపడతాడు. మన మంచు అక్క లక్ష్మీ కూడా ఈ విషయంలో వెనక్కి తగ్గదు. అందుకే ఈ ఫ్యామిలీ నుంచి ఎంత గొప్ప సినిమా వస్తుందన్నా కూడా.. చేశార్రే బోడీ అన్నట్టుగా పక్కనపెట్టేస్తుంటారు. ఇలాంటి తరుణంలో ‘కన్నప్ప’ అనే ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌ని డీల్ చేశాడు మంచు విష్ణు. దాదాపు రూ.200 కోట్లు భారీ బడ్జెట్‌తో మంచు విష్ణు లీడ్‌ రోల్‌లో నటించిన ‘కన్నప్ప’ సినిమా.. మంచి అంచనాలతో రేపు (జూన్ 26)న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమాను ఇండస్ట్రీ ప్రముఖులతో వీక్షించారు. సినిమాపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్, ముంబైలో స్పెషల్ ప్రీమియర్లను వేసి చూపించారు. ఈ ప్రీమియర్స్‌కి పలువురు నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, సినీ క్రిటిక్స్ హాజరయ్యారు. గతంలో ఎన్నాడూ లేని విధంగా ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా చూసిన దర్శక, నిర్మాత మచ్చా రవి లాంటి వాళ్లు బొమ్మ బ్లాక బస్టర్ హిట్ అని చెప్పేశారు. అయితే ఆడియో ఈవెంట్‌లలో సినిమా బావుంటుందనే చెప్తారు తప్పితే ఫ్లాప్ అని చెప్పరు కదా.. ఇలాంటి వాళ్ల పక్కన పెడితే.. కన్నప్ప సినిమాను చూసిన కొంతమంది బాలీవుడ్ క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. బాలీవుడ్ రివ్యూవర్స్ అంటే ఉమైర్ సంధు లాంటి ఫేక్ గాళ్లు కాదు కానీ.. కాస్త జెన్యూన్‌గా రివ్యూలు ఇచ్చే రివ్యూవర్సే కన్నప్పకి పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో ఈ సినిమాకి బుకింగ్స్ కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ మేనియా.. ‘కన్నప్ప’కి బాగా కలిసొస్తుంది. ఇంతకీ ఈ సినిమా గురించి క్రిటిక్స్ ఏమంటున్నారంటే.. రోహిత్ జైస్వాల్ అనే మూవీ క్రిటిక్.. కన్నప్ప సినిమాపై స్పందిస్తూ.. ‘నా మాట నమ్మండి.. ఈ సినిమా చూసిన తరువాత శివ భక్తులు ఊగిపోతారు. చివరి 40 నిమిషాలు నెక్స్ట్ లెవల్ అంతే. రియల్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకుని అల్లిన కథ ఇది. దేవుడంటే నమ్మకం లేని వ్యక్తి.. శివ భక్తుడిగా ఎలా మారాడన్నదే కథ. స్క్రిప్ట్, వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్‌లో లోపాలు ఉన్నాయి. భక్తి చిత్రంలో రక్తి కాస్త ఎక్కువగా కనిపించింది. అది తగ్గిస్తి ఉంటే బాగుండేది. నిడివి కూడా తగ్గిస్తే సినిమా ఇంకా బాగుండేది’ అంటూ రివ్యూ ఇచ్చారు రోహిత్ జైస్వాల్. మరో రివ్యూవర్ సుమిత్ కడెల్ స్పందిస్తూ.. ‘కన్నప్ప ప్రీమియర్ చూశాను. నాకైతే చివరి 30 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అంతే. కథ కథనాలు మైండ్ నుంచి పోవడం లేదు. కాంతారా క్లైమాక్స్ చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ కనిపించింది కన్నప్ప‌లో. శివ భక్తుల్ని కంటతడిపెట్టించారు. ప్రభాస్ ఎంట్రీ అద్దిరిపోయింది. మోహన్ లాల్ సీక్వెన్స్ టెర్రిఫిక్. శివ భక్తుడిగా పోరాట యోధుడిగా ‘కన్నప్ప’ అద్దరగొట్టాడు. కాస్త ఫస్టాఫ్ స్లోగా ఉన్నా.. ఓవరాల్‌గా సినిమా బావుంది’ అంటూ రివ్యూ ఇచ్చారు. ఇక టాలీవుడ్ పాపులర్ రైటర్ కోన వెంకట్ కూడా కన్నప్ప చిత్రాన్ని వీక్షించగా.. ఆయన కూడా బ్లాక్ బస్టర్ హిట్ రివ్యూ ఇచ్చేశారు. ‘నాకు కన్నప్ప చూసే అవకాశం దక్కింది. కంటెంట్ నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. సెకండాఫ్‌లో వావ్ అనిపించే మూమెంట్స్ చాలా ఉన్నాయి. చివరి అరగంట మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రభాస్ ఇంపాక్ట్ ఈ సినిమా బాగా పనిచేసింది. చివరి 20 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడు మంచి విష్ణు నటన గురించి మాట్లాడుకుంటారు. మోహన్ బాబుగారి నటన గురించి చాలా ఏళ్లు మాట్లాడుకుంటారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్ప చిత్రంగా నిలుస్తుందని.. శ్రమకు తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నా’ అంటూ కోనా వెంకట్ రివ్యూ ఇచ్చారు. మొత్తానికి కన్నప్ప చిత్రానికి వస్తున్న పాజిటివ్ రివ్యూలు చూస్తుంటే.. మంచు విష్ణు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే అనిపిస్తుంది. ఈ సినిమాలో నటించడంతో పాటు.. నిర్మాత కూడా అతనే. కథ, స్క్రీన్ ప్లే కూడా మంచు విష్ణుదే. బాలీవుడ్ దర్శకుడు, మహా భారతం సీరియల్ ఫేమ్ ముఖేఖ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ప్రభాస్ కీలకపాత్రలో కనిపించగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, శరత్ కుమార్, కాజల్, ప్రీతి ముకుందన్, శివ బాలాజీ ముఖ్య పాత్రల్లో నటించారు.