హైరిటర్న్స్ ఇచ్చిన టాప్-10 స్కీమ్స్.. 10వేల పొదుపుతో రూ.49 లక్షలు.. ఎన్నేళ్లు పట్టిందంటే?

Wait 5 sec.

: ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఒక సులువైన మార్గం. ప్రతి నెలా కొంత మొత్తం పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు. గత 10 సంవత్సరాల్లో సిప్ పని తీరు ఆధారంగా టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్‌ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, సెక్టోరల్ ఫండ్స్, టాక్స్ సేవర్ ఫండ్స్ వంటి ముఖ్యమైన ఫండ్ పథకాలు ఉన్నాయి. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టి ఓపికగా కొనసాగినట్లయితే మంచి లాభాలు అందుకోవచ్చని నిరూపించాయి. సిప్ ద్వారా పెట్టుబడి అనేది ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొద్ది కొద్దిగా నెల నెలా ఇన్వెస్ట్ చేస్తూ పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. గత 10 సంవత్సరాల్లో 20 శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన టాప్ 10 సిప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1. క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్: గత 10 సంవత్సరాల సిప్ రాబడి 26.62 శాతంగా ఉంది. ఈ రేటుతో, నెలకు రూ. 10,000 సిప్ చేస్తే 10 సంవత్సరాల్లో రూ. 49.14 లక్షలుగా మారేది. ఒకేసారి రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే అది రూ. 6.58 లక్షలు అయి ఉండేది.2. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్: ఈ స్కీమ్ గత 10 సంవత్సరాల కాలంలో సిప్ రాబడి 25.01 శాతంగా అందించింది. నెలకు రూ. 10,000 సిప్ చేస్తే ఈ 10 సంవత్సరాల్లో చేతికి రూ. 45.05 లక్షలు వచ్చేవి. ఒకేసారి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ. 7.90 లక్షలు అందేవి. 3. మోతీలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్: ఈ పథకం గత 10 సంవత్సరాల సిప్ రాబడి 23.93 శాతంగా ఉంది. ఇందులో నెలకు రూ. 10,000 సిప్ చేసి ఉంటే ఇప్పుడు రూ. 42.51 లక్షలు వచ్చేవి. ఒకేసారి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే రూ. 5.71 లక్షలు అయ్యేది.4. క్వాంట్ ELSS టాక్స్ సేవర్ ఫండ్: ఈ స్కీమ్ 10 సంవత్సరాల సిప్ రాబడి 23.61 శాతంగా ఉంది. ఇందులో నెలకు రూ. 10 వేలు సిప్ చేస్తే 10 సంవత్సరాల కొనసాగితే ఇప్పుడు రూ. 41.76 లక్షలు అయ్యేది. ఒకేసారి రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి రూ. 7.13 లక్షలు అయ్యేది. 5. ఎడెల్‌వైజ్ మిడ్ క్యాప్ ఫండ్: గత 10 సంవత్సరాల సిప్ రాబడి 23.53 శాతంగా ఉంది. నెలకు రూ. 10 వేల చొప్పున పొదుపు చేస్తే 10 సంవత్సరాలలో రూ. 41.58 లక్షలు అవుతుంది. ఒకేసారి రూ. 1 లక్ష పెట్టిన వారికి రూ. 6 లక్షలు వచ్చేవి.6. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్: దీని 10 సంవత్సరాల సిప్ రాబడి 23.51 శాతంగా. ఇందులో నెలకు రూ. 10,000 సిప్ చేస్తూ 10 సంవత్సరాలు కొనసాగినట్లయితే రూ. 41.53 లక్షలు అయ్యేది. ఒకేసారి రూ. 1 లక్ష పెడితే రూ. 5.10 లక్షలు అయ్యేది.7. ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్: ఈ స్కీమ్ గత 10 సంవత్సరాల సిప్ రాబడి 23.34 శాతంగా ఉంది. ఈ పథకంలో నెలకు రూ. 10,000 పొదుపు చేస్తూ వస్తే 10 సంవత్సరాలలో రూ. 41.16 లక్షలు అయ్యేది. ఒకేసారి రూ. 1 లక్షపెడితే ఇప్పుడు రూ. 6.06 లక్షలు అయ్యేది.8. నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్: ఈ ప్లాన్ 10 సంవత్సరాల సిప్ రాబడి 22.61 శాతంతో నెలకు రూ. 10,000 సిప్ చేసి ఉంటే 10 సంవత్సరాల్లో రూ. 39.56 లక్షలు అవుతుంది. ఒకేసారి రూ. 1 లక్ష పెట్టిన వారికి రూ. 5.64 లక్షలు అయ్యేది.9. ఫ్రాంక్లిన్ బిల్డ్ ఇండియా ఫండ్: ఈ స్కీమ్ గత 10 ఏళ్ల సిప్ రాబడి 22.50 శాతంగా ఉంది. ఇందులో నెలకు రూ. 10 వేలు సిప్ పొదుపు చేస్తే 10 సంవత్సరాలలో రూ. 39.33 లక్షలు అయ్యి ఉండేది. లేదా ఒకేసారి రూ. 1 లక్ష పెడితే ఇప్పుడు రూ. 5.47 లక్షలు అయ్యేది.10. ఎల్ఐసీ ఎంఎఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్: దీని 10 సంవత్సరాల సిప్ రాబడి 22.33 శాతంతో లెక్కిస్తే రూ. 10,000 సిప్ పొదుపు 10 సంవత్సరాల్లో రూ. 38.98 లక్షలు అవుతుంది. ఒకేసారి రూ. 1 లక్ష పెట్టుబడితో రూ. 4.61 లక్షలు అయ్యేది.