క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ వచ్చేసింది. దాయాదుల మధ్య జరిగే అసలైన పోరును చూసేందుకు యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా స్టేడియాలు కిటకిటలాడటమే కాకుండా టీఆర్పీ రేట్లు కూడా బద్దలవుతూ ఉంటాయి. దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో అతిపెద్ద పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. 2017లో ఈ రెండు జట్లు ఫైనల్స్‌లో తలపడగా టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ఐసీసీ ఈవెంట్లలో పాక్‌పై భారత్ ఓడిన ఏకైక మ్యాచ్ కూడా ఇదే. ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా జరగడం అందులోనూ భారత్ ఫైనల్‌కి వెళ్లి పాక్‌పై ఓడిపోవడాన్ని టీమిండియా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని పాక్‌ని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. పాకిస్తాన్ జట్టు కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 338 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఫఖర్ జమాన్ 114 పరుగులతో సెంచరీ చేయగా, అజర్ అలీ, మహమ్మద్ హఫీజ్ హాఫ్ సెంచరీలు చేశారు. బాబర్ ఆజామ్ 46 పరుగులు చేశాడు. 339 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాను పాక్ బౌలర్ అమీర్ దెబ్బతీశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, విరాట్ కోహ్లిని అవుట్ చేసి టీమిండియా ఓటమిని శాసించాడు. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఒక్కడే పోరాడగా.. రవీంద్ర జడేజా రనౌట్ చేయించడంతో భారత అభిమానులు ఆశలు కోల్పోయారు. పాండ్యా 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. కేవలం 30.3 ఓవర్లలోనే 158 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. దాంతో పాకిస్తాన్ 180 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుని తొలిసారి ఛాంపియన్స్‌గా నిలిచారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించడం.. రన్నర్స్‌గా నిలిచిన టీమిండియా ఈరోజు మ్యాచ్‌లో పాక్‌పై రివేంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇప్పటికే విజయం సాధించి టీమిండియా జోష్‌లో ఉండగా.. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలయింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీస్ బెర్త్ ఖాయమైనట్లే.. అలాగే పాక్ ఓడితే ఇక ఇంటిదారి పట్టినట్టే. దాంతో ఇరుజట్లకి కీలకమైన ఈ మ్యాచ్‌లో చాలా ఉత్కంఠభరితంగా సాగనుంది. ఫఖర్ జమాన్ అవుట్న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడిన ఫఖర్ జమాన్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి రూలుడ్ అవుట్ (పూర్తిగా దూరం) అయ్యాడు. టీమిండియాపై మంచి రికార్డులున్న ఫఖర్ జమాన్ దూరమవ్వడంతో భారత్‌కు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్ ఆర్డర్ సరిగాలేని పాకిస్తాన్‌కు ఇది కోలుకోలేని దెబ్బ అని చెప్పొచ్చు.2017లో ఉన్న ప్లేయర్లు వీళ్లే2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన జట్టులో భారత ఆటగాళ్లు నలుగురు ఉండగా పాకిస్తాన్ నుంచి ఒకే ఒక్క ప్లేయర్ ఉన్నాడు. టీమిండియా నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ఉండగా.. పాకిస్తాన్ జట్టులో కేవలం బాబర్ ఆజామ్ మాత్రమే ఉన్నాడు. టీమిండియా స్క్వాడ్ రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్.పాకిస్తాన్ స్క్వాడ్మహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), బాబర్ ఆజామ్, ఇమామ్ ఉల్ హక్, సౌద్ షకీల్, సల్మాన్ ఆఘా, తయ్యుబ్ తాహీర్, ఖుల్దుల్ షా, షాహీన్ షా, నసీమ్ షా, హారీశ్ రావూఫ్, అబ్రార్ అహ్మద్, కమ్రాన్ గులామ్, ఫాహీమ్ అష్రఫ్, మహమ్మద్ హస్నయిన్, ఉస్మాన్ ఖాన్.