TG: విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Wait 5 sec.

ఇది నిజంగా విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. ఎందుకుంటే తెలంగాణ ప్రభుత్వం రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు తెలంగాణ మెుత్తం కాదు. కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటన విడుదల చేశారు. రేపటి సెలవుకు బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది. కాగా, ఈనెల 26న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మహాశివరాత్రి పర్వదినం సదర్భంగా సర్కార్ సెలవు మంజూరు చేసింది. ఈనెల 25న ఒక్కరోజు స్కూళుకు వెళితే.. మళ్లీ 26న సెలవు రానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండ్రోజులు సెలవు తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ- ఖమ్మం- వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు మంజూరు చేసింది. ఈ నెల 27న ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సులభంగా ఓటు వేసేందుకు వారికి కూడా సెలవు మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండనున్నారు. ఎన్నికల రోజున ఉద్యోగులు విధులకు హాజరయ్యే అవసరం లేకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా, 27 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరుసగా రెండు రోజులు ఉద్యోగులకు సెలవులు రానున్నాయి.