37కి 3.. 324 పరుగులకు 7! మీరేంటో.. మీ బౌలింగ్ ఏంటో.. ఆ ఫీల్డింగ్ ఏంటో!!

Wait 5 sec.

ఇంగ్లండ్ జట్టు ఆటతీరుపై అందరూ అసహనంగానే ఉన్నారు. ఆరంభంలోనే వికెట్లు తీసినా తక్కువ స్కోర్‌కు ప్రత్యర్థులను కట్టడి చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ బౌలింగ్ మరీ పేలవంగా ఉంది. వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటతీరు ఇంత దారుణంగా పడిపోయిందా అన్నట్టు అప్ఘనిస్తాన్‌పై ఆడారు. ఛాంపియన్స్ ట్రోఫీలో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో చేతికందిన గెలుపును చేజేతులారా కిందపడేశారు. లాహోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటతీరు ముఖ్యంగా బౌలర్లు తీవ్ర నిరాశకు గురి చేసింది. 37 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయినా 324 పరుగులు బాదించడం ఇంగ్లండ్ ఫ్యాన్స్‌ని బాధపెట్టింది. క్రికెట్ పుట్టిల్లు ఇప్పుడు కనుమరుగు అవుతుందా అనిపించింది. ఫస్ట్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బౌలర్లు ఆ తర్వాత అంత ప్రభావం చూపలేకపోయారు. ఇంగ్లండ్ పేసర్ మార్క్ ఉడ్ 150 కిలోమీటర్లకు పైగా బంతులు విసరగలుగుతున్నాడే కానీ వాటిని వికెట్లుగా మలచడంలో దారుణంగా విఫలమయ్యాడు. అప్ఘన్‌తో జరిగిన మ్యాచ్‌లో కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.. దానికి తోడు 8 ఓవర్లు బౌలింగ్ చేసి 50 పరుగులు సమర్పించుకున్నాడు. బ్రైడన్ కార్స్ స్థానంలో వచ్చిన జెమీ ఓవర్టన్ కూడా పది ఓవర్లలో 72 పరుగులు, ఆర్చర్ 64, రూట్ 47 పరుగులు సమర్పించుకున్నారు. 9వ ఓవర్‌లో వికెట్ మళ్లీ 30వ ఓవర్‌లోనేవన్డే క్రికెట్‌లో కీలకమైన మిడిల్ ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేదు. 8.5వ ఓవర్‌లో వికెట్ తీసిన ఇంగ్లండ్ జట్టు మళ్లీ 29.3వ బంతికి వికెట్ పడగొట్టారు. అంటే మధ్యలో 20 ఓవర్లు ఎలాంటి వికెట్ దక్కించుకోలేదు. ఆఖరి 20 ఓవర్లలోనూ కేవలం 3 వికెట్లు మాత్రమే తీసుకున్నారు. దాంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అప్ఘన్లు భారీ స్కోర్ చేశారు. ఫీల్డింగ్ ఫెయిల్యూర్అందివచ్చిన అవకాశాలను కూడా ఇంగ్లండ్ జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. గాల్లోకి లేచిన బంతులను వికెట్‌గా మలచడంలో విఫలమయ్యారు. జోఫ్రా ఆర్చర్ ఒక్క అడుగు ముందుకు వేస్తే దొరికే బంతిని కూడా అందుకోలేకపోయారు. బౌండరీల వద్ద క్యాచ్‌లు అందుకోలేక వాటిని సిక్సర్లుగా పంపించారు. ఫీల్డింగ్ చేసే సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తరచూ గాయాలపాలయ్యి డగౌట్‌కి వెళ్లిపోయారు. ఇంటిదారిఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బీలో బలంగా కనిపించిన ఇంగ్లండ్ తన పూర్ పర్ఫార్మెన్స్‌తో ఇంటిదారి పట్టింది. వీక్‌గా కనిపించిన ఆస్ట్రేలియా జట్టును ఫుల్ ఫామ్‌లోకి తీసుకొచ్చి మొదటి మ్యాచ్‌లో ఓడిన ఇంగ్లండ్, రెండో మ్యాచ్‌లోనూ ఓడి అప్ఘనిస్తాన్‌కి సెమీస్ అవకాశాలు అందించింది. ఇంగ్లండ్ ఇక తన ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే సౌతాఫ్రికా సెమీస్ ఆశలు ఆవిరయ్యే అవకాశం ఉంది.