ఇండియా చేతిలో ఓడితే ఓకే.. మరి ఇప్పుడు ఏమంటావు? బెన్ డకెట్‌పై నెట్టింట ట్రోల్స్

Wait 5 sec.

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ జట్టు ఇంటిదారి పట్టింది. చావో రేవో మ్యాచ్‌లో అప్ఘనిస్తాన్‌పై ఓటమితో గ్రూప్ స్టేజ్ నుంచి ఎలిమినేట్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లండ్ జట్టు ప్రదర్శన అనంతరం ఇండియన్ ఫ్యాన్స్ బెన్ డకెట్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. గతంలో ఈ ఇంగ్లిష్ ఓపెనర్ అన్న మాటలే ఇప్పుడు ఈ ట్రోల్స్‌కు కారణం. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్ జట్టు భారత్‌తో వన్డే సిరీస్ అయింది. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్ దారుణ ప్రదర్శన ఇచ్చింది. మూడు వన్డేల్లోనూ ఓటమిపాలయ్యి వైట్‌వాష్‌కు గురైంది. సిరీస్ అనంతరం స్పందిస్తూ ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదని, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమిండియాను ఓడించబోతున్నామని ఓవర్ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు. బెన్ డకెట్ చేసిన కామెంట్స్‌పై మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ వెంటనే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. కట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ స్టేజ్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి. భారత్‌పై సిరీస్ ఓడినా మాకు ఫర్వాలేదు అన్నావ్.. మరి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటకు వెళ్లారు ఇది ఓకేనా అంటూ టీమిండియా ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంగ్లండ్ ఆటతీరుపై భారతీయులే కాకుండా ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంగ్లండ్ జట్టు వన్డే క్రికెట్‌లో బాగా ఆడి చాలా సంవత్సరాలే అయింది.. మాకు ఈ ఓటమి ఏమీ ఆశ్చర్యాన్ని కలిగించలేదంటూ మైకెల్ వాన్ సర్కాస్టిక్ కామెంట్స్ చేశాడు. పూర్ పర్ఫార్మెన్స్ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ పూర్ పర్ఫార్మెన్స్‌తో ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియా, అప్ఘనిస్తాన్‌తో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఇంగ్లండ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడమే ఇంగ్లండ్ ఓటమికి కారణమైంది. ఆస్ట్రేలియా రాణించిన బ్యాటర్లు, అప్ఘనిస్తాన్‌పై ప్రభావం చూపలేకపోయారు. ఫలితంగా ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు ఘోరమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. ఈ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఆసీస్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్లలో 351 పరుగులు చేసింది. బెన్ డకెట్ 165, జో రూట్ 68 పరుగులతో రాణించారు. 352 పరుగుల లక్ష్యాన్ని నిలువరించడంలో ఇంగ్లండ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. అప్ఘనిస్తాన్‌పై జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చేతులెత్తేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇబ్రహీం 177, హష్మతుల్లా షాహీద్ 40, అజ్మతుల్లా 41, నబీ 40 పరుగులతో రాణించారు. 326 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆఖరి వరకూ పోరాడి 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. జో రూట్ 120 మినహా మిగతా ఏ బ్యాటర్ కూడా క్రీజులో నిలబడలేదు.