అప్ఘనిస్తాన్ ఆఖరి 20 ఓవర్ల స్కోర్ ఎంతో తెలుసా? ఓరినీ టీ20 ఆడేశారు కదరా!

Wait 5 sec.

అఫ్ఘనిస్తాన్ జట్టు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆడుతూ పెద్ద జట్లకి గట్టి పోటీ ఇస్తోంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో టాప్ టీమ్స్‌కి షాక్ ఇచ్చి సెమీస్‌లో అడుగుపెట్టిన ఈ జట్టు.. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి ఇంటికి పంపింది. ఇంగ్లండ్‌పై అప్ఘన్ల గేమ్ ప్లాన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆరంభంలో నిదానంగా ఆడిన ఈ జట్టు ఆఖర్లో టీ20 తరహాలో చెలరేగిపోయారు. లాహోర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించిన ఆ జట్టు ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గుర్భాజ్, సెడిఖుల్లా అటల్, రహ్మతుల్లా ఫస్ట్ పవర్ ప్లేలోనే వరుసగా 6, 4, 4 పరుగులు చేసి పెవలియన్ బాట పట్టారు. అప్ఘనిస్తాన్ ఆటతీరు.. ఇంగ్లండ్ బౌలింగ్ చూసిన ప్రేక్షకులు అప్ఘనిస్తాన్‌ను 200లోపే ఆలౌట్ చేస్తారని అనుకున్నారు. కానీ కెప్టెన్ హష్మతుల్లా షాహీద్, ఇబ్రహీం జర్దాన్‌తో కలిసి మ్యాచ్‌ని నిలబెట్టాడు. అప్ఘనిస్తాన్ 8.5వ ఓవర్‌లో మూడో వికెట్ కోల్పోగా 29.3వ ఓవర్‌లో నాలుగో వికెట్ కోల్పోయింది. అంటే దాదాపు 20 ఓవర్ల పాటు వికెట్ పడకుండా అప్ఘన్లు జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత నుంచి తమ గేమ్ ప్లాన్ అమలు చేశారు. ఆఖరి 20 ఓవర్లలో టీ20 రేంజ్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశారు. ఓపెనర్ ఇబ్రహీం జర్దాన్ సెంచరీ అనంతరం తన బ్యాట్ పవర్ చూయించాడు. ముప్పై ఓవర్లు అయిపోయే సమయానికి అప్ఘనిస్తాన్ స్కోర్ నాలుగు వికెట్ల నష్టానికి 143 పరుగులు. కెప్టెన్ హష్మతుల్లా షాహీద్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 31 బంతులులు ఆడిన అజ్ముతుల్లా ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 41 పరుగులు బాదాడు. ఆ తర్వాత వచ్చిన నబీ కూడా 24 బంతుల్లోనే రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. అదే సమయంలో ఇబ్రహీం కూడా ఫోర్లు, సిక్సర్లు బాది 146 బంతుల్లో 177 పరుగులు చేశాడు దాంతో 50 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఆఖరి 20 ఓవర్లలో అప్ఘనిస్తాన్ జట్టు 182 పరుగులు బాదింది. అంటే టీ20 రేంజ్‌లో ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేశారు. ఆఖరి పది ఓవర్లలో అయితే 104 పరుగులు చేశారు. ఆఖరి పది ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయింది అది కూడా చివరి ఓవర్‌లోనే. వన్డే క్రికెట్‌ను ఎలా ఆడాలో అప్ఘనిస్తాన్ జట్టు కూడా సరిగ్గా అలానే ఆడింది. అప్ఘన్ల ఆటతీరు చూసిన ఆస్ట్రేలియా ప్లేయర్లు ఆఖరి మ్యాచ్‌లో వీళ్లను అవుట్ చేసేందుకు కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.