తెలంగాణకు కేంద్రం శుభవార్త.. 39 హైవేలకు రూ.5,658 కోట్లు నిధులు

Wait 5 sec.

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.5,658 కోట్లు కేటాయించినట్టు కేంద్ర ఉపరితల రవాణాశాఖ విడుదల చేసిన బడ్జెట్‌ పద్దుల గణాంకాలు వెల్లడించాయి. వీటిలో ముఖ్యంగా ఎల్బీనగర్‌-మల్కాపురం సెక్షన్‌ ఆధునికీకరణకు రూ.145 కోట్లు, NH 930Pలో వెలిగొండ-తొర్రూరు సెక్షన్‌ ఆధునికీకరణకు రూ.124 కోట్లు, NH161B కర్ణాటక సరిహద్దు వరకు విస్తరణకు రూ.156 కోట్లు, NH 167N మహబూబ్‌నగర్‌-చించోలి సెక్షన్‌ విస్తరణకు రూ.161 కోట్లు, NH 161BB బోధన్‌-బాసర-భైంసా సెక్షన్‌ విస్తరణకు రూ.155 కోట్లు, NH 765DG మెదక్‌-సిద్దిపేట సెక్షన్‌ విస్తరణకు రూ.129 కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది.NH 167K కల్వకుర్తి-కొల్లాపుర్‌ సెక్షన్‌ విస్తరణకు రూ.199 కోట్లు, NH 167N మహబూబ్‌నగర్‌-చించోలి సెక్షన్‌ విస్తరణకు రూ.212 కోట్లు, మెదక్‌-ఎల్లారెడ్డి సెక్షన్‌ విస్తరణకు రూ.129 కోట్లు, NH 765D ఎల్లారెడ్డి-రుద్రూరు సెక్షన్‌ విస్తరణకు రూ.154 కోట్లు, NH 365A ఖమ్మం కుర్వి సెక్షన్‌ విస్తరణకు రూ.140 కోట్లు, NH 353B ఆదిలాబాద్‌-బేలా సెక్షన్‌ విస్తరణకు రూ.160 కోట్లు, NH 167కKలో కృష్ణానదిపై హైబ్రిడ్‌ కేబుల్‌ స్టయిడ్‌ సస్పెన్షన్‌ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.106 కోట్లు, NH 930Pలో గౌరెల్లి-వెలిగొండ సెక్షన్‌ ఆధునికీకరణ కోసం రూ.171 కోట్లు కేటాయించింది.అలాగే, NH 163లో హైదరాబాద్‌-భూపాలపట్నం మధ్య 7.950 కి.మీ. మేర 6 వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం కోసం రూ.269 కోట్లు, మిర్యాలగూడ-కోదాడ మధ్య NH 167 ఆధునికీకరణ కోసం రూ.314 కోట్లు, హైదరాబాద్‌-పుణె NH 65లో సంగారెడ్డి క్రాస్‌రోడ్డు నుంచి మదీనాగూడ మధ్య 6 వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.384 కోట్లు కేటాయించినట్టు తెలిపింది. అయితే, గతేడాదితో పోల్చితే ఈ కేటాయింపులు తగ్గడం గమనార్హం. 2024-25 వార్షిక బడ్జెట్‌లో తెలంగాణలో జాతీయ రహదారుల కోసం రూ.7,394 కోట్లను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ ఏడాది మాత్రం దాని కంటే రూ.1736 కోట్ల మేర కోత విధించారు.