: ఈ ఏడాది ఈనెల 25వ తేదీ (బుధవారం) రోజున వచ్చింది. హిందువులకు అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైనా మహా శివరాత్రి రోజున సాధారణంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులు సహా చాలా మందికి ముందుగానే సెలవులు ఇచ్చారు. అయితే స్టాక్ మార్కెట్లు, బ్యాంకులకు సెలవు ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మదుపర్లు, వినియోగదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-ఎన్ఎస్ఈ ప్రతీ సంవత్సరానికి సంబంధించి స్టాక్ మార్కెట్ల సెలవుల జాబితాను ముందుగానే విడుదల చేస్తుంది. ఆ క్యాలెండర్ ప్రకారం మహా శివరాత్రి రోజున సెలవు ప్రకటించారు. మహా శివరాత్రి కారణంగా బుధవారం నిఫ్టీ, సెన్సెక్స్‌లో ట్రేడింగ్ ఉండదని తెలిసింది. అయితే ఈ 2025 ఏడాదిలో స్టాక్ మార్కెట్లకు ఇదే తొలి సెలవు దినం కావడం గమనార్హం. అయితే బ్యాంకులకు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు ఉంది. ఇక సోమవారం స్టాక్ మార్కెట్లకు మరో బ్లాక్ మండేగా మిగిలింది. సెన్సెక్స్‌పై బేర్ పంజాతో సోమవారం ఒక్కరోజే 856 పాయింట్ల కోల్పోయి.. 75 వేలకు దిగువకు పడిపోయింది. దీంతో 4.22 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైపోయింది. ఇవాళ కాస్త కుదురుకుని మార్కెట్లు ఫ్లాట్‌‍గా కొనసాగుతున్నాయి. ఈ ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 101 పాయింట్లు పెరిగి 75,555 వద్ద.. నిఫ్టీ 9 పాయింట్లు తగ్గి 22,546 వద్ద ప్రారంభం అయ్యాయి. ఇక మహా శివరాత్రి సందర్భంగా దేశంలోని 15 రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు. గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, సిక్కం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో బుధవారం మహా శివరాత్రి రోజున బ్యాంకులకు సెలవు ప్రకటించారు.2025లో స్టాక్ మార్కెట్లకు సెలవులునేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-ఎన్ఎస్ఈ క్యాలెండర్ ప్రకారం.. ఏడాదిలో పలు పండుగల కారణంగా 14 రోజుల పాటు స్టాక్ మార్కెట్లకు సెలవులు ఉంటాయి. అంటే ఏడాదిలో 14 రోజుల పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు మూసివేసి ఉండనున్నాయి. ఇక మహా శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీన వచ్చే సెలవు ఈ ఏడాదిలో మొట్టమొదటిది కావడం గమనార్హం. మరోవైపు.. మార్చి 14వ తేదీన హోలీ పండగ సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మూసివేయనున్నారు. అదేవిధంగా ఈద్-ఉల్-ఫితర్ పండగ నేపథ్యంలో మార్చి 31వ తేదీన స్టాక్ మార్కెట్లకు సెలవు ఉండనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెలలో శ్రీ మహావీర్ జయంతి కారణంగా ఏప్రిల్ 10వ తేదీన స్టాక్ మార్కెట్లు బంద్ కానున్నాయి. ఇక ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 18వ తేదీన గుడ్ ఫ్రైడే కారణంగా స్టాక్ మార్కెట్లు మూతపడనున్నాయి. ఆ తర్వాత మే 1వ తేదీన మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్లు మూసివేయనున్నారు. అనంతరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. ఆ తర్వాత గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్ట్ 27వ తేదీన మార్కెట్ బంద్ కానుంది. అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి కారణంగా.. దీపావళి సందర్భంగా అక్టోబర్ 21వ తేదీన.. దీపావళి ప్రతిపద కారణంగా అక్టోబర్ 22వ తేదీన మార్కెట్ మూసివేయనున్నారు. గురునానక్ దేవ్ జయంతి కారణంగా నవంబర్ 5వ తేదీన స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉండనుంది. క్రిస్మస్ కారణంగా డిసెంబర్ 25వన స్టాక్ మార్కెట్ మూసివేయనున్నట్లు ఎన్ఎస్ఈ క్యాలెండర్ ప్రకారం తెలుస్తోంది.