భోపాల్‌లో జరుగుతోన్న మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో అనూహ్య పరిణామాం చోటుచేసుకుంది. భోజనాల సమయంలో ఎగబడిన ఇన్వెస్టర్లు పూరీ, సబ్జీ కోసం కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ప్లేట్లు విసురుకుని నానా హంగామా సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. భోపాల్‌లో గ్లోబల్ ఇన్వెస్టిమెంట్ సదస్సు నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సును ప్రారంభించగా.. 60 దేశాలకు చెందిన ప్రతినిధులు, గౌతమ్ అదానీ సహా దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.ఈ సదస్సుకు హాజరైనవారికి భోజనాలు ఏర్పాటు చేయగా. ఒక్కసారిగా అందరూ డైనింగ్ హాల్‌లోకి దూసుకొచ్చారు. క్యూలైన్‌‌లో ఒకరి నొకరు తోసుకుంటూ.. ప్లేట్లు లాక్కుంటూ గందరగోళం సృష్టించారు. భోజన సమయంలో ఆహారం తీసుకోవడానికి వెళ్తుండగా విరిగిన ప్లేట్లు ఫ్లోర్‌పై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా? హాజరైన వారిలో తీవ్ర నిరాశ వల్ల జరిగిందా? అనే చర్చకు దారితీసింది.వీడియోను చూసిన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘మధ్యప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ప్రభుత్వం పెట్టిన ఫ్రీ ఫుడ్ కోసం నకిలీ ‘పెట్టుబడిదారులు’ చేసిన ఈ హడావిడి, బార్ అసోసియేషన్ ఫంక్షన్లలో ఫుడ్ స్టాల్స్ కోసం లాయర్లు హడావిడి చేస్తారో నాకు గుర్తుకొచ్చింది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ పెట్టుబడిదారుల సమ్మిట్‌లో పట్టణాల్లో విధ్వంసాన్ని తెలియజేస్తోంది... త్వరలో, నేతలు, బడా బాబులు కమిషన్‌లో తమ వాటా కోసం కొట్టాడుతారు’ అని ఓ నెటిజన్ వ్యంగ్యంగా పోస్ట్ పెడితే.. ‘నేను చాలా సమ్మిట్‌లకు హాజరయ్యాను కానీ మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో దృశ్యాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.. ప్రతి ఒక్కళ్లూ భోజనం కోసం కొట్టుకుంటున్నారు’ అని ఇంకొకరు పోస్ట్ పెట్టాడు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా పెట్టుబడుల కోసం సదస్సు నిర్వహిస్తే.. వీళ్లంతా ఇంత చీప్‌గా బిహేవ్ చేయడం ఏంటి? అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.