బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం () సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ఒడిశాలోని పూరీ తీరానికి సమీపంలో 91 కి.మీ లోతున ఉదయం 6.10 గంటలకు భూకంపం సంభవించినట్టు తెలిపింది. దీని ప్రభావంతో పశ్చిమ్‌ బెంగాల్‌‌, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు ఎన్‌సీఎస్‌ పేర్కొంది. కోల్‌కతా, భువనేశ్వర్ సహా చాలాచోట్ల ప్రకంపనలు వచ్చినట్టు తెలిపింది.కోల్‌కతా నగరంలో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతగా నమోదయినట్టు తెలుస్తోంది. భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరిగిందా? అనేది? స్పష్టత లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు భూకంపం గురించి పోస్ట్‌లు పెడుతున్నారు. ఎక్స్‌ (ట్విట్టర్)‌లో Earthquake హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. తీవ్రత గురించి, ఆ ప్రాంతాల్లోని వ్యక్తుల భద్రత గురించి ఆరా తీస్తున్నారు. ‘‘భూకంప హెచ్చరిక! కోల్‌కతాలో ఉదయం 6:10 గంటలకు గూగుల్‌లో భూకంప హెచ్చరిక వచ్చింది.. ఒడిశా నుంచి 175 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి... మరెవరైనా ప్రకంపనలను అనుభవించారా? అధికారిక నిర్ధారణ కోసం వేచి చూస్తున్నాను.. అప్రమత్తంగా ఉండండి.. సురక్షితంగా ఉండండి!’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.