Prisoner Death Threats to Rajasthan CM: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు తాజాగా హత్య బెదిరింపులు వచ్చాయి. దౌసా జైల్లో ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న ఓ యువకుడు నేరుగా పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి మరీ సీఎంను చంపబోతున్నట్లు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే తమకు వచ్చిన ఫోన్ నెంబర్, లొకేషన్ ఆధారంగా అది జైల్లో నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆపై విచారణ సాగించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.శుక్రవారం - శనివారం రోజు అర్ధరాత్రి జైపూర్ పోలీస్ కంట్రోల్ రూంకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. రాజస్థాన్ ముఖ్యమంత్రిని చంపబోతున్నట్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తమకు వచ్చిన పోన్ నెంబర్, లొకేషన్ ఆధారంగా ఆ ఫోన్ ఎవరు చేశారో గుర్తించారు. ముఖ్యంగా దౌసా జైలు నుంచి ఆ ఫోన్ రాగా.. అక్కడకు వెళ్లి సోదాలు నిర్వహించారు. శనివారం వేకువజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అంటే నాలుగు గంటల పాటు తనిఖీలు చేపట్టగా.. ఫోన్ దొరికింది. ఈక్రమంలోనే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా ఓ ఖైదీయే ఈ బెదిరింలకు పాల్పడినట్లు గుర్తించారు. ముఖ్యంగా సీఎంను చంపేస్తానంటూ ఫోన్ చేసిన ఖైదీ పేరు రింకు కాగా.. ప్రస్తుతం అతడికి 29 ఏళ్ల వయసు. అయితే అత్యాచారం కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న రింకు వద్దకు ఫోన్ రావడానికి కారణం జైల్లో ఉన్న ఓ అధికారియే కారణం అని కూడా పోలీసులు గుర్తించారు.ముఖ్యంగా ఈ దర్యాప్తు బాధ్యతను జైలు ఇన్‌స్పెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్‌కు అప్పగించినట్లు రాష్ట్ర హోంమంత్రి జవహార్ సింగ్ బేధం తెలిపారు. అసలు నిందితుడు ఎందుకు బెదిరింపులకు పాల్పడ్డాడు, ఇంకా ఇతడికి ఎవరెవరు సహకరించారు వంటి విషయాలను జైలు ఇన్‌స్పెక్టర్‌యే తేల్చబోతున్నారు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.