అద్భుతం చేసిన పెన్నీ స్టాక్.. రూ.1 లక్షకు రూ.4.45 కోట్లొచ్చాయ్.. ఎన్నేళ్లు పట్టిందంటే?

Wait 5 sec.

: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గత కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. ఇటీవల వరుస సెషన్లలో నష్టపోతున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఓ స్టాక్ మాత్రం రోజూ లాభాల్లోనే కొనసాగుతోంది. తమ ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తోంది. అదే టాన్‌ఫాక్ ఇండస్ట్రీస్ (Tanfac Industries Ltd) షేరు. ఈ స్టాక్ 445 రెట్లు మేర పెరిగింది. తమ షేర్ హోల్డర్లను మిలియనీర్లను చేసేసింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి ఏకంగా రూ.4.45 కోట్లు అందించింది. మరి ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. హిస్టరీ గమనిస్తే మనీ మేకింగ్ స్టాక్‌గా షేర్ హోల్డర్లకు వివిధ ఇంటర్వెల్స్‌లో భారీ లాభాలు అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది. ఫిబ్రవరి 21, 2024న టాన్‌ఫాక్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.8 వద్ద ఉండగా.. అది ఫిబ్రవరి 21, 2025 శుక్రవారం మార్కెట్లు ముగిసే నాటికి రూ.3,566 స్థాయిని టచ్ చేసింది. గడిచిన 11 సంవత్సరాల్లో ఇన్వెస్టర్లకు 445 రెట్లు లాభాలు అందించింది. 2014లో రూ.1 లక్ష పెట్టి ఈ కంపెనీ షేర్లు కొనుగోలు చేసి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే ఇప్పుడు ఆ షేర్ల విలువ రూ.4.45 కోట్లకుపైగా ఉంటుంది. గడిచిన నెల రోజుల్లో టాన్‌ఫాక్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2930 నుంచి రూ.3566కు పెరిగింది. నెల రోజుల్లోనే 20 శాతం ర్యాలీ చేసింది. ఇక ఈ ఏడాది 2025లో ఇప్పటి వరకు చూస్తే ఈ కంపెనీ షేరు రూ.3062 నుంచి రూ.3566కు చేరింది. అంటే 16 శాతం మేర రాబడులు అందించింది. ఇక గత ఆరు నెలల్లో చూసుకుంటే ఈ స్టాక్ 50 శాతం పెరిగింది. ఇక గత ఏడాది కాలంలో 80 శాతం పెరిగింది. ఇదే క్రమంలో గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకుంటే రూ.118 నుంచి రూ.3566కు చేరింది. ఏకంగా 2,900 శాతం మేర పెరిగింది. లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఇప్పుడు రూ.30 లక్షలు వచ్చేవి. అదే గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఏకంగా 17,700 శాతం పెరిగింది. లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.1.77 కోట్లుగా ఉండేది.