ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. కాశ్మీర్‌లో రెచ్చిపోయిన టెర్రరిస్ట్‌లు

Wait 5 sec.

: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సైనికులు వెళ్తున్న వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో సుందర్‌బానీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులు.. ఆర్మీ వాహనంపై విచక్షణ రహితంగా కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన సైనికులు.. వారిపై ఎదురు కాల్పులకు దిగారు. సైనిక వాహనంపై ఉగ్రవాదులు 3 నుంచి 4 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనతో అప్రమత్తమైన సైన్యం.. ఆ ప్రాంతం మొత్తాన్ని అధీనంలోకి తీసుకుంది. ఉగ్రవాదుల జాడ కనుగొనేందుకు ఈ అటవీ ప్రాంతం మొత్తం గాలింపు చేపడుతున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా లేక చనిపోయారా అనేది ఇంకా అధికారులు ధృవీకరించలేదు