ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలివే..!

Wait 5 sec.

తెలంగాణ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్ న్యూస్ వినిపించారు. వారాంతాల్లో హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో.. రద్దీని దృష్టిలో పెట్టుకుని.. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఏపీకి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా.. చర్లపల్లి నుంచి ఏపీలో కాకినాడ టౌన్, నర్సాపూర్‌కు ప్రత్యేక రైళ్లు నడిపించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మొత్తం 20 ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నట్టు అధికారులు తెలిపారు. రేపటి నుంచే (ఫిబ్రవరి 28వ తేదీన) తొలి రైలు పట్టాలెక్కనుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను.. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఏ శ్రీధర్ విడుదల చేశారు. ఫిబ్రవరి 28తో పాటు మార్చి 7, 13, 21, 28 తేదీల్లో.. 07031 నెంబర్ గల ప్రత్యేక రైలు.. సాయంత్రం 7:20 నిమిషాలకు బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు గంటల 30 నిమిషాలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో 07032 నెంబర్ గల ప్రత్యేక రైలు.. సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు కాకినాడ టౌన్ నుంచి బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటల 50 నిమిషాలకు చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అయితే.. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. మరోవైపు.. ఫిబ్రవరి 28వ తేదీతో పాటు మార్చి 7, 13, 21, 28 తేదీల్లో 07233 నెంబర్ గల ప్రత్యేక రైలు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల 50 నిమిషాలకు నర్సాపూర్‌కు చేరుకోనుంది. ఇక.. మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో 07234 నెంబర్ గల ప్రత్యేక రైలు రాత్రి 8 గంటలకు నర్సాపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.