ఆరు లోకోమొటివ్‌లు, 295 బోగీలు ఉన్న 3.5 కి.మీ పొడవైన గూడ్స్ రైలు, సూపర్ వాసుకి రైలు ఫోటో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) అని చెప్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చక్లెయిమ్: భారతీయ రైల్వే వారి సూపర్ వాసుకి గూడ్స్ రైలు ఫోటో.ఫ్యాక్ట్(నిజం): ఆరు లోకోమొటివ్‌లు, 295 బోగీలు ఉన్న 3.5 కి.మీ పొడవైన సూపర్ వాసుకి రైలు యొక్క టెస్ట్ రన్ 15 ఆగస్ట్ 2022లో ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్ దగ్గర ఉన్న రాజ్‌నంద్‌గావ్ మధ్య నడిచింది. కాకపోతే, వైరల్ పోస్టులో కనిపిస్తున్న రైలు సూపర్ వాసుకి కాదు. ఈ ఫోటో కనీసం 2015 నుంచి ఇంటర్నెట్లో ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. ముందుగా సూపర్ వాసుకి రైలు గురించి ఇటర్నెట్లో వెతకగా, ఆగస్టు 2022లో భారతీయ రైల్వే వారు ఈ గూడ్స్ రైలు(ఫ్రైట్ ట్రైన్) యొక్క టెస్ట్ రన్ నిర్వహించారు అని చెప్పిన వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి.15 ఆగస్ట్ 2022న ఆరు లోకోమొటివ్‌లతో నడిచే ఈ 295 బోగీల 3.5 కి.మీ పొడవైన సూపర్ వాసుకి రైలుని దాని టెస్ట్ రన్ రోజున ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్ దగ్గర ఉన్న రాజ్‌నంద్‌గావ్ మధ్య నడిపారు. సూపర్ వాసుకి రైలు యొక్క వీడియోని 16 ఆగస్టు 2022న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు(ఇక్కడ, ఇక్కడ). అలాగే రైల్వే శాఖ వారు తమ అధికారిక ‘X’ హ్యాండిల్‌లో ఈ రైలు గురించి జనవరి మరియు ఫిబ్రవరి 2021లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు (ఇక్కడ, ఇక్కడ).Super Vasuki – India's longest (3.5km) loaded train run with 6 Locos & 295 wagons and of 25,962 tonnes gross weight.#AmritMahotsav pic.twitter.com/3oeTAivToY— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 16, 2022అయితే, వైరల్ పోస్టులో ఉన్న ఫోటో మాత్రం సూపర్ వాసుకి రైలుది కాదు. ఈ ఫోటో సూపర్ వాసుకి టెస్ట్ రన్ చేయక ముందు నుంచే ఇంటర్నెట్లో ఉంది. దీని cropped అండ్ కలర్ గ్రేడెడ్ వెర్షన్ ఒకటి మాకు జూలై 2015 నాటి ఒక ఫేస్‌బుక్ పోస్టులో లభించింది.వైరల్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ ఫొటోని చాలా వెబ్సైటులలో పలు రకాల articles లో వాడరు అని మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). wallhere.com వారు ఈ ఫొటోని 2017 లో అప్లోడ్ చేశారు. వైరల్ ఫొటోలో ఉన్న రైలు ఇంజిన్ పైన BNSF అనే టెక్స్ట్ ఉండడం గమనించి దాని గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఇది అమెరికాలో ఉన్న ప్రైవేట్ ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ అని మాకు తెలిసింది. ఈ ఫోటో గురించి సెర్చ్ చేస్తున్న సమయంలో వైరల్ ఫోటో మాదిరిగా ఉన్న అనేక స్టాక్ ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు లభించాయి. ఫ్లికర్ వెబ్సైట్లో ఉన్న ఇటువంటి ఫోటోల యొక్క వివరణలో ఈ లొకేషన్ అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో ఉన్న Antelope Coal Mine దగ్గర ఉంది అని ఉంది. ఈ ప్రదేశం పేరు లోగన్ హిల్ అని ఈ ఫోటోల వివరణలో ఉంది. గూగుల్ మ్యాప్స్ ఈ లొకేషన్ మీరు ఇక్కడ చూడవచ్చు.అదనంగా, 2022 టెస్ట్ రన్ తర్వాత ప్రస్తుతం సూపర్ వాసుకి గుడ్స్ రైలు నడుస్తున్నట్టుగా మాకు ఎటువంటి వార్తా కథనాలు లభించలేదు. చివరగా, ఈ ఫోటోలో కనిపిస్తున్న రైలు ఇండియన్ రైల్వే వారి ‘సూపర్ వాసుకి’ కాదు, ఇది అమెరికా దేశానికి చెందిన ఫ్రైట్ రైల్ కంపెనీ BNSF వారి రైలు. The post ఈ ఫోటోలో కనిపిస్తున్న రైలు ఇండియన్ రైల్వే వారి ‘సూపర్ వాసుకి’ కాదు, ఇది అమెరికా దేశానికి చెందిన ఫ్రైట్ రైల్ కంపెనీ BNSF వారి రైలు appeared first on FACTLY.