ధూమపాన ప్రియులకు చేదువార్త.. మరింత పెరగనున్న సిగరెట్ ధరలు

Wait 5 sec.

in India: ధూమపాన ప్రియులకు కేంద్ర ప్రభుత్వం చేదువార్త చెప్పబోతుంది. త్వరలోనే సిగరెట్లతో పాటు పొగాకు ఉత్పత్తుల ధరలను పెంచాలని భావిస్తోంది. పన్ను ఆదాయం తగ్గకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం సిగరెట్, పొగాకు ఉత్పత్తులకు జీఎస్టీ ధరలను పెంచాయలని చూస్తోంది. ప్రస్తుతం వీటిపై జీఎస్టీ 28 శాతం ఉండగా.. ఇతర ఛార్జీలతో కలిసి 52 శాతం పన్నులు విధిస్తున్నారు. త్వరలోనే జీఎస్టీని 28 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది. దీంతో సిగరెట్లు సహా పొగాకు ఉత్పత్తులపై ధరలు అధికంగా పెరగనున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై విధించే పరిహార సెస్ గడువు 2026వ సంవత్సరం మార్చి నెలతో ముగియబోతుంది. ఒకవేళ అది లేకపోయినా పన్ను ఆదాయం తగ్గకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం.. పాత సెస్ స్థానంలో కొత్త సెస్ ప్రవేశ పెట్టాలని కోరుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా పొగాకు, సిగరెట్లపై జీఎస్టీ ధరలను పెంచబోతుంది. జీఎస్టీ కౌన్సిల్ ఆధ్వర్యంలోని మంత్రుల ప్యానెల్ ప్రస్తుతం ఈ అంశాన్ని సమీక్షిస్తోంది. తుది నిర్ణయం తీసుకునే ముందు దాని సిఫార్సులను సమర్పించే అవకాశం కూడా ఉంది.ధూమపానం ఆరోగ్యానికి హానికరం కావడం, వీటి వల్లే అనేక మంది క్యాన్సర్ బారిన పడుతూ నరకం చూడడం, ప్రాణాలు పోగొట్టుకోవడం వల్ల వీటిని పాపపు వస్తువులు కేటగిరీలో చేర్చారు. అందుకే వీటి వినియోగాన్ని తగ్గించేందుకు, వినియోగదారులను నిరుత్సాహ పరిచేందుకు వీటిపై భారీగా పన్ను విధిస్తున్నారు. ముఖ్యంగా వీటిపై ప్రాథమిక ఎక్సైజ్ డ్యూటీ, జాతీయ విపత్తుల కంటింటెంజ్ డ్యూటీలను కూడా విధిస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం సిగరెట్ల పన్ను 53 శాతంగా ఉండగా.. ఇది ప్రపంచ ఆరోగ్యం సంస్థ సిఫార్సు చేసిన 75 శాతం కంటే తక్కువ. పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు భారీ పన్ను ఆదాయాన్ని సృష్టిస్తాయి. 2022-2023లో పొగాకు ఉత్పత్తుల వల్ల రూ.72,788 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఇదిలా ఉండగా పొగాకు ఉత్పత్తులపై పరిహార సెస్ ప్రస్తుతం 5 శాతంగా ఉండగా.. దీనితో పాటు 1000 సిగరెట్లకు వాటి పొడవు, ఫిల్టర్, రుచి ఆధారంగా రూ.2,076 నుంచి రూ.4,170 వరు అదనపు నిర్ధిష్ట లెవీ విధించబడుతోంది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులపై పన్నును సమీక్షించేందుకు జీఎస్టీ కౌన్సిల్ గతంలో అప్పటి ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజన్ పూజారి నేతృత్వంలో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీళ్లే జీఎస్టీ ధరల పెంపను పరిశీలిస్తున్నారు. చూడాలి మరి ఏ జరగనుంది అనేది.