: (RBI) ఈ ఏడాది వరుసగా మూడోసారి రెపో రేటును తగ్గించింది. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు, ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్ల మేర కోత పెట్టగా జూన్ ఎంపీసీ సమావేశంలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టాలని నిర్ణయం తీసుకుంది.సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్లు చేసే వారికి మాత్రం నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే బ్యాంకులు డిపాజిట్ల వడ్డీ రేట్లను మరింత తగ్గించేస్తాయి. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే రాబడులు భారీగా తగ్గిపోతాయి. ఎస్‌బీఐ రీసెర్చ్ (SBI Research) నివేదిక ప్రకారం.. ఈ ఏడాది 2025, ఫిబ్రవరి నుంచి 30-70 బేసిస్ పాయింట్ల మేర తగ్గాయి. ఎఫ్‌డీ వడ్డీ రేట్ల తగ్గింపుతో పాటు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లలోనూ బ్యాంకులు కోత పెట్టాయి. ప్రస్తుతం 2.70 శాతం వడ్డీ ఇస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో మొత్తంగా 100 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ తగ్గిపోవచ్చని అంచనా వేసింది. అయితే, సీపీఐ ఇన్‌ఫ్లేషన్ 4 శాతం లోపే ఉంటే అది సాధ్యమవుతుందని పేర్కొంది. వడ్డీ రేట్లు తగ్గించే డిపాజిటర్లు ఏం చేయాలి?వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లకు చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నష్టాలు తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలను అన్వేషించవచ్చు. అందులో ఒకటి ప్రస్తుతం అత్యధిక వడ్డీ రేట్లు ఉన్న డిపాజిట్ పథకాలను ఎంచుకోవడం. ఇప్పటికీ చాలా బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి. అలాంటి బ్యాంకుల్లో అధిక వడ్డీ రేట్లపై డిపాజిట్ చేస్తే నష్టాలను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు 8 శాతం ఆపైన వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి. అయితే, ఇది త్వరలోనే తగ్గిపోవచ్చు. ఆలోపు బుక్ చేసుకుంటే ఫిక్స్‌డ్ వడ్డీ రేటుతో కొనసాగవచ్చు. అయితే చాలా వరకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోనే అధిక వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో డిపాజిట్ చేయడం రిస్క్ అని భావిస్తారు. అయితే, రూ.5 లక్షల లోపు డిపాజిట్ చేస్తే ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుందని గమనించాలి. ఎస్‌బీఐ వంటి చాలా పెద్ద బ్యాంకులు ప్రస్తుతం 7 శాతం ఆపైన వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ఎలాంటి రిస్క్ తీసుకోము అనుకునే వారు ఈ బ్యాంకులను ఆశ్రయించవచ్చు. అలాగే స్వల్ప కాల ఎఫ్‌డీలకు బదులుగా దీర్ఘకాల ఎఫ్‌డీలను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. షార్ట్ టర్మ్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు వేగంగా మారుతుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కసారిగా తగ్గిపోవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీ ల్యాడర్ (FD laddering) ఉపయోగించవచ్చు. దీంతో ఎక్కువ రాబడి అందుకోవచ్చు. అలాగే బ్యాంకుల్లో తక్కువ వడ్డీ వస్తే కార్పొరేట్ ఎఫ్‌డీలను పరిశీలించవచ్చు. కార్పొరేట్ సంస్థలు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి. మంచి రేటింగ్ ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు.