ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన బలమైన సుడిగుండం, నైరుతి రుతుపవనాల బలపడటంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. సోమవారం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు ఈదురుగాలులు, ఉరుములు, పిడుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.ఉత్తర తెలంగాణ ప్రజలుఅప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన సుడిగుండం ప్రభావంతో నేటి నుంచి మంగళవారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా జూలై 7వ తేదీన వర్షపాతం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.వాతావరణ నివేదికల ప్రకారం.. ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ మీదుగా ఏర్పడిన బలమైన సుడిగుండం సాయంత్రానికి ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని తాకుతుంది. దీని ప్రభావంతో నేటి నుంచి మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 52 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండగా.. తెలంగాణలో గంటకు 23 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. గాలులకు తోడు నైరుతి రుతుపవనాల బలపడటంతో సోమవారం ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జయశంకర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కొనసాగుతాయి.బలమైన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వ హెచ్చరికలను పాటించాలని కోరారు.