TTD: శ్రీవారి అన్నప్రసాదంలో వడలు.. ఇకపై రాత్రి పూట కూడా..

Wait 5 sec.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. శ్రీవారి దర్శనం విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్న టీటీడీ.. విషయంలోనూ పలు జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటోంది. శ్రీవారి భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఇకపై రాత్రి వేళ కూడా వడ్డించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఆదివారం నుంచి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకూ అన్నప్రసాదంలో వడలు వడ్డిస్తోంది.టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదివారం సాయంత్రం అన్నప్రసాదంలో వడలు వడ్డింపు కార్యక్రమం ప్రారంభించారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఆదివారం సాయంత్రం స్వామి చిత్రపటం వద్ద వడలను‌ ఉంచి పూజ నిర్వహించారు. ఆనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా అన్నప్రసాదం, వడ రుచిపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. శ్రీవారి భక్తులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ మధ్యాహ్న భోజన సమయంలో వడల వడ్డిస్తున్నామని.. ఇకపై రాత్రి భోజనం సమయంలోనూ వడలు అందించనున్నట్లు వివరించారు.మరోవైపు భక్తుల కోసం టీటీడీ ప్రస్తుతం రోజూ 70 వేల నుంచి 75 వడలను ప్రత్యేకంగా తయారు చేయిస్తోంది. శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, సోంపు వంటి పదార్థాలతో భక్తుల రుచికి అనుగుణంగా వడలు తయారు చేయిస్తోంది. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా వడల వడ్డింపు కార్యక్రమం ప్రారంభించిన టీటీడీ.. భక్తుల నుంచి మంచి స్పందన రావటంతో మధ్యాహ్న భోజనం సమయంలో భక్తులకు వడలు వడ్డిస్తోంది. ఇప్పుడు రాత్రి కూడా వడలు వడ్డించాలని నిర్ణయించిన టీటీడీ.. ఆదివారం నుంచి ఆ నిర్ణయం అమలు చేస్తోంది. ప్రతి రోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు.