లండన్ నుంచి చేరుకున్న ఇంజినీర్ల బృందం.. F 35B ఫైటర్ జెట్ ఎయిర్‌లిఫ్ట్‌కు రెడీ

Wait 5 sec.

గత మూడు వారాలుగా రిపేర్ చేయడానికి, తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం యునైడెట్ కింగ్‌డమ్ నుంచి 24 మంది ఇంజినీర్ల బృందం ప్రత్యేక విమానంలో ఆదివారం కేరళకు చేరుకుంది. అత్యంత భద్రత మధ్య ఉన్న ఈ విమానానికి మరమ్మత్తులు చేయనున్నారు. రాయల్ ఎయిర్ ఫోర్స్ A400M విమానంలో ఏవియేషన్ ఇంజినీర్లు ప్రత్యేక పరికరాలతో ల్యాండయ్యారు. అనంతరం విమానానికి అవసరమైన మరమ్మతులు చేయడానికి హ్యాంగర్‌కు తరలించారు. దీనిని సీ-17 గ్లోబ్‌మాస్టర్ రవాణా విమానంలో తరలించాలని యోచిస్తున్నారు. అవసరమైన మరమ్మతులు, భద్రతా తనిఖీల తర్వాత విమానం తిరిగి సేవలను ప్రారంభిస్తుందని బ్రిటిష్ హైకమిషన్ అధికారి వెల్లడించారు. దీనివల్ల ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు. కేరళ విమానాశ్రయంలో ఉన్న ఫైటర్ జెట్‌కు భారీ భద్రత కల్పించారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది దీనికి కాపలాగా ఉన్నారు. ఈ విమానం గత నెలలో భారత్-యూకే సంయుక్త నేవీ విన్యాసాల్లో పాల్గొంది. ఆ సమయంలో మొదట్లో ప్రతికూల వాతావరణం, ఇంధనం లేకపోవడం వల్ల అత్యవసరంగా దించారని చెప్పారు. కానీ, ఆ తర్వాత ఫైటర్ జెట్‌లో ఇంజినీరింగ్ సమస్య ఉందని యూకే అధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం అదే రోజు రాత్రి ఏడబ్ల్యూ101 మెర్లిన్ హెలికాఫ్టర్‌లో నిపుణులు వచ్చారు. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో అప్పటి నుంచి ఈ భారీ యుద్ధ విమానం ఎయిర్‌పోర్టులోనే ఉండిపోయింది. అయితే, విమానం హ్యాంగర్ పార్కింగ్ కోసం ఎయిరిండియా ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద యుద్ధ విమానంగా ఎఫ్-35 నిలిచింది. అమెరికా తయారుచేసిన ఈ ఫైటర్ జెట్‌లో అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. ఈ సాంకేతికత ఇతరులకు తెలియకూడదనే ఉద్దేశంతోనే హ్యాంగర్‌కు తరలించడానికి నిరాకరించింది. అటు, కాగా, మే 2019లో మొదటిసారి ఎఫ్-35బిను ఫ్లోరిడా నుంచి సీ-17 గ్లోబ్‌మాస్టర్‌లోనే తరలించారు. ఈ అపూర్వమైన రక్షణ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి అయింది. అత్యాధునిక సాంకేతికత కలిగిన F-35 లైట్‌నింగ్ II స్టెల్త్ యుద్ధవిమానం రెక్కలను తొలిసారిగా వేరుచేసి విమాన రవాణా చేశారు.. ఈ మిషన్‌లో C-17 గ్లోబ్‌మాస్టర్ ఎయిర్‌లిఫ్ట్ వాహనంగా పనిచేసింది. విమానం ఫ్లోరిడాలోని ఎగ్లిన్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ఉటాలోని హిల్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు తరలించారు.ఈ మిషన్ సాధారణమైంది కాదు. నాలుగేళ్లుగా ప్రణాళికతో సాగిన 200,000 డాలర్లు విలువైన ప్రాజెక్ట్. ఎఫ్-35 విమానం కీలక స్టెల్త్ టెక్నాలజీ కారణంగా ప్రతి భాగం అత్యంత జాగ్రత్తతో విచ్ఛిన్నం చేశారు.