క్యాన్సర్‌తో బాధపడుతున్న కార్యకర్తకు చంద్రబాబు వీడియో కాల్.. నేనున్నాంటూ భరోసా

Wait 5 sec.

ఓవైపు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపేందుకు చర్యలు తీసుకుంటూనే.. మరో వైపు పార్టీ వ్యవహారాలపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఓ నాయకుడిగా స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి వారి సాధకబాధకాలు అడిగి తెలుసుకుంటున్నారు. సాయం కోరుతూ వచ్చే వారిని, సమస్యలతో వచ్చే వారిని దగ్గరకు పిలుచుకుని వారితో మాట్లాడి.. అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. కార్యకర్త పోశిబాబుని కలిసి.. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అతడి వద్ద చెప్పులు కూడా కొన్నారు. తర్వాత తన కాన్వాయ్‌లో పోశిబాబుని కూర్చోబెట్టుకుని ప్రయాణం చేశారు. గతంలో కూడా పార్టీ కోసం పని చేస్తున్న పలువురు కార్యకర్తలను స్వయంగా వెళ్లి కలిశారు. . ఈక్రమంలో తాజాగా చంద్రబాబు నాయుడు మరోసారి కార్యకర్తలపై తనకుండే అభిమానాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ టీడీపీ కార్యకర్తకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ వివరాలు.., రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి చెందిన ఆకుల కృష్ణ టీడీపీ కార్యకర్త. అతడికి చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి అభిమానం. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేస్తున్నాడు. ఒక్కసారైనా కలవాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు క్యాన్సర్ బారిన పడ్డాడు. రోజు రోజుకు అతడి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈక్రమంలో ఒక్కసారైన తన అభిమాన నేత చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలని భావించారు. కుటుంబ సభ్యులు అతడి కోరిక నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేశారు. విషయం కాస్త చంద్రబాబు దృష్టికి చేరింది.దీంతో అభిమాని కోరిక మేరకు చంద్రబాబు నాయుడు అతడితో మాట్లాడారు. శనివారం నాడు ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా తాను అండగా ఉంటాను అని కృష్ణకు, ఆయన కుటుంబానికి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.ఆరోగ్యం విషమంగా ఉండటం వల్ల కృష్ణ సరిగ్గా మాట్లాడలేకపోయారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నాకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంది అని కృష్ణ అన్నారు. చంద్రబాబు నాయుడు చేసిన పనిపై టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత ఎన్నటికి తమకు తోడుగా ఉంటారని మరోసారి నిరూపించారని అంటున్నారు. కార్యకర్తల కోసం ఆయన ఏం చేయడానికైనా వెనకాడరని కొనియాడుతున్నారు.