కోరిన కోరికలు నెరవేర్చే చెరువు.. ఇందులో స్నానం చేస్తే చాలు..

Wait 5 sec.

నెల్లూరులో సందడి మొదలైపోయింది. జులై 6 (ఆదివారం) నుంచి నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే చాలా మంది భక్తులు రొట్టెల పండుగ జరిగే కు చేరుకున్నారు. లక్షల మంది ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మతసామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగను భావించవచ్చు. పాల్గొంటారు. ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ నిర్వహించనున్నారు. ఆదివారం రొట్టెల పండుగ ప్రారంభం కానుండగా.. సోమవారం గంధ మహోత్సవం నిర్వహిస్తారు. మంగళవారం రొట్టెల పండగ జరుగుతుంది. రొట్టెల పండుగ ఎప్పుడు చేస్తారు?మొహర్రం నెలలో రొట్టెల పండుగ నిర్వహించడం ఆచారం. ఈ నెలలో నెలవంక కనిపించిన పదకొండో రోజు నుంచి 5 రోజులు రొట్టెల పండగ జరుపుకుంటారు. ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండగగా ప్రకటించింది. అలాగే ఈ పండుగలో పాల్గొనేందుకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఆ చెరువులో స్నానం చేస్తే కోరికలు తీరుతాయ్..మరోవైపు బారాషహీద్ దర్గాను దర్శించుకున్న తర్వాత.. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరికలు నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. స్వర్ణాల చెరువులో స్నాననం చేసిన తర్వాత రొట్టెలు మార్చుకుంటే కోరిన కోరికలు సిద్ధిస్తాయని నమ్మకం. అయితే ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, సంపద, చదువు, ఆరోగ్యం, సొంతిల్లు, పెళ్లి ఇలా ఒక్కో కోరికకు ఒక్కో రొట్టె ఉంటుంది. తమ కోరికలకు అనుగుణంగా రొట్టె స్వీకరించాలి. ఈ ఏడాది రొట్టెల పండుగకు వెళ్లి రొట్టె స్వీకరించిన వారు తమ కోరిక నెరవేరిన తర్వాత.. తప్పనిసరిగా మళ్లీ రొట్టెల పండుగకు వచ్చి రొట్టె విడిచిపెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఘాట్, బారాషహీద్ దర్గా ఆవరణలో సందడి నెలకొంది.