HDFC బ్యాంక్ షాకింగ్ నిర్ణయం.. జులై 1 నుంచి కొత్త రూల్స్.. ఆ పేమెంట్లపై ఛార్జీలు!

Wait 5 sec.

HDFC Bank: దేశీయ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. క్రెడిట్ కార్డు ఫీజులు, రివార్డ్ ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లింపులు, ఆన్‌లైన్ గేమింగ్, వాలెట్ లోడింగ్ వంటివి చేసినప్పుడు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది. అలాగే ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు వచ్చే రివార్డ్ పాయింట్లపై పరిమితిలు విధించింది. మరి ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెంట్ పేమెంట్ చేస్తే ఛార్జీలు.. మొత్తం ఎంత అద్దె చెల్లిస్తున్నారనే నగదు బట్టి దీనిని లెక్కిస్తారు. నెలలో గరిష్ఠంగా రూ. 4,999 వరకు ఛార్జ్ చేస్తారు. ఆన్‌లైన్ గేమింగ్ ఛార్జీలు.. నెల రోజుల్లో చేసిన ట్రాన్సాక్షన్ నగదు మొత్తానికి ఈ ఫీ వర్తిస్తుంది. గరిష్ఠంగా ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 4,999 వరకు ఫీ ఉంటుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ద్వారా ఆన్‌లైన్ గేమింగ్స్ చేసే ట్రాన్సాక్షన్లకు ఎలాంటి రివార్డ్ పాయింట్లు, క్యాష్ పాయింట్లు ఉండవు. వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు.. అలాగే వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు (పేజ్ యాప్ PayZapp మినహా) నెలలో రూ. 10 వేలు దాటితే 1 శాతం ఛార్జీలు వసూలు చేస్తారు. ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ. 4,999 వరకు గరిష్ఠ ఫీజు ఉంటుంది. జులై 1 తర్వాత వాలెట్ లోడింగ్ ట్రాన్సాక్షన్లు అమలులోకి వస్తాయి. నెలలో రూ.10 వేలు దాటి లోడింగ్ చేస్తే 1 శాతం మేర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్లపై రివార్డ్ పాయింట్లు.. ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్లు చేసినప్పుడు వచ్చే రివార్డ్ పాయింట్లకు పరిమితిలు విధించారు. ఇన్‌ఫినియా, ఇన్‌ఫినియా మెటల్ ఎడిషన్ క్రెడిట్ కార్డులకు నెలకు 10 వేల పాయింట్ల వరకు లిమిట్ ఉంటుంది. అలాగే డైనర్స్ బ్లాక్, డైనర్స్ బ్లాక్ మెటల్, హెచ్ఓజీ డైనర్స్ క్లబ్, బిజ్ బ్లాక్ మెటల్ కార్డ్స్ అయితే నెలకు 5000 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇక ఇతర హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు నెలవారీ రివార్డ్ పాయింట్లు 2000 మాత్రమే వస్తాయి.