Miss World 2025: Miss Thailand Opal Suchata crowned Miss World in final competition in Hyderabad

Wait 5 sec.

 Miss World 2025:Miss Thailand Opal Suchata crowned Miss World in final competition in Hyderabad(adsbygoogle = window.adsbygoogle || []).push({});మిస్ వరల్డ్ 2025: హైదరాబాద్ లో ఫైనల్ పోటీలో మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న మిస్ థాయిలాండ్ ఓపల్ సుచట ====================72వ మిస్వరల్డ్ పోటీల్లో థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ ప్రపంచ సుందరి కిరీటాన్నిసొంతం చేసుకున్నారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికికిరీటాన్ని సుచాతా చువాంగ్ కు ధరించారు. 1వ రన్నర్ అప్ఇథియోపియా, 2వ రన్నర్ అప్ లో మిస్ పోలెండ్, 3వ రన్నర్ అప్ లో మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ వరల్డ్ గాఎంపికైన సుచాతకు.. రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీఅందనుంది.సుచాత..థాయ్లాండ్ లో ని ఫుకెట్ లో జన్మించారు. మొత్తం 108 దేశాలకు చెందిన కంటెస్టెంట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సుచాతకు ప్రపంచసుందరి కిరీటం దక్కడంతో థాయిలాండ్లో సంబరాలు అంబరాన్నంటాయి.సుచాత.. 'ఓపల్ ఫర్ హర్ - Opal For HER’ నినాదంతో మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ నినాదంద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడిన ఆమె..థాయ్ లాండ్ లో   రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నారు. క్యాన్సర్ బాధితులకుఅండగా ఉండేందుకు నిధుల సేకరించడంతోపాటు, కొన్నిసంస్థలతో కలిసి పని చేస్తున్నారు. ప్రభావితం చూపే లక్ష్యంతో యువత ముందడుగు వేయాలనిఆమె పిలుపునిచ్చారు.గత 20 రోజులుగా ప్రపంచాన్ని అలరించిన అంతర్జాతీయ స్థాయి అందాలపోటీలు ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 72వ మిస్ వరల్డ్ తుది పోటీలతో సందడి నెలకొంది. ఆఖరి అంచెపోటీల్లో సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ కు 40 మంది ఎంపికవ్వగా.. ఒక్కో ఖండం నుంచి ఇద్దరు ముందజ వేశారు. ఇలా ఫైనల్ రౌండ్ కు నలుగురుఎంపికవ్వగా.. అందులో థాయ్లాండ్ సుందరి సుచాతను మిస్ వరల్డ్ కిరీటం వరించింది.====================(adsbygoogle = window.adsbygoogle || []).push({});