: చాలా క్లిష్టమైన, కష్టమైన పని. ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి నోటీసులు రాకుండా ఉండాలంటే, తప్పులు లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయడం చాలా ముఖ్యం. ఈ సంవత్సరం .. సీజన్ ప్రారంభంలో, 45 రోజుల అదనపు సమయం లభించింది. ఇప్పుడు ఈ పొడిగింపు చాలా మందికి ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, రిటర్న్‌లలో తప్పులు చేసే అవకాశం ఉంది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం.. టాప్ 7 తప్పులను నివారించడం ఎలాగో చూద్దాం.ITR ఫైలింగ్‌లో చేయకూడని 7 మిస్టేక్స్ ఇవే..తప్పుడు ITR ఫారం ఎంచుకోవడం:సాధారణంగా చేసే తప్పులలో ఇది ఒకటి. సరైన ITR ఫారం ఎంచుకోకపోవడం, దాఖలు చేసిన రిటర్న్‌లను సరిచూసుకోకపోవడం, లేదా ఐటీఆర్ దాఖలు చేయనవసరం లేదని తప్పుగా భావించడం వంటివి జరుగుతుంటాయి. ఇంకొక సాధారణ అపోహ ఏమిటంటే, పన్ను చెల్లించాల్సిన అవసరం లేని వారు.. ఐటీఆర్ దాఖలు చేయనవసరం లేదని భావించడం. కానీ, మీరు రూ. 2 లక్షలకు పైగా అంతర్జాతీయ ప్రయాణాలకు ఖర్చు చేసి ఉంటే, లేదా రూ. 1 లక్షకు పైగా విద్యుత్ వినియోగానికి ఖర్చు చేసి ఉంటే, లేదా ఇలాంటి ఇతర ఖర్చులు చేసి ఉంటే ITR దాఖలు చేయడం తప్పనిసరి. ఇంకా మీకు పన్ను/టీడీఎస్ (TDS) రీఫండ్ రావాల్సి ఉన్నా ఐటీఆర్ దాఖలు చేయాలి. AIS, ఫారం 26AS ధ్రువీకరణ..చాలా మంది వ్యక్తులు ఐటీఆర్ సమర్పించే ముందు తమ వార్షిక సమాచార నివేదిక (AIS), ఫారం 26AS ను ధ్రువీకరించడం మర్చిపోతుంటారు. ఈ డాక్యుమెంట్లు మీ ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల పూర్తి వివరాల్ని అందిస్తాయి. వీటిని సరిచూసుకోకుంటే మీరు సబ్మిట్ చేసిన ఐటీఆర్‌లో తేడాలు వచ్చి నోటీసులు రావొచ్చు.ఆదాయాన్ని పూర్తిగా ప్రకటించకపోవడం..ఆదాయ వనరులను (అది అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా అయినా) ప్రకటించకపోవడం చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దీనివల్ల చెల్లించాల్సిన పనుల్లో 50 శాతం నుండి 200 శాతం వరకు జరిమానాలు, అదనపు వడ్డీ ఛార్జీలు, చట్టపరమైన చర్యలు కూడా ఉండవచ్చు.బడ్జెట్ 2024 మార్పులను సరిచూసుకోకపోవడం..బడ్జెట్ 2024లో చేసిన కొత్త మార్పుల కారణంగా పన్ను చెల్లింపుదారులు తప్పులు చేసే అవకాశం ఉంది. సవరించిన ITR ఫారమ్‌లకు కొత్త నిబంధనలు ఉన్నాయి, అలాగే డిడక్షన్లు, క్యాపిటల్ గెయిన్స్ టాక్స్‌లో మార్పులు చూసుకోవాలి. మినహాయింపు పొందిన ఆదాయాన్ని ప్రకటించకపోవడం..మినహాయింపు పొందిన ఆదాయం (ఉదాహరణకు, వ్యవసాయ ఆదాయం, కొన్ని రకాల గ్రాట్యుటీలు) పన్ను పరిధిలోకి రాదు కాబట్టి, దానిని పన్ను లెక్కల్లో చేర్చరు. అయినప్పటికీ, దానిని ఐటీఆర్‌లోని సంబంధిత విభాగంలో (షెడ్యూల్ EI) తప్పకుండా ప్రకటించాలి. ఇది చాలా మంది చేసే చిన్న పొరపాటు, కానీ దీనివల్ల కూడా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావొచ్చు.ఆదాయాన్ని విస్మరించడం/తప్పుగా చూపించడం..ఒకే ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలు మారిన వ్యక్తులు తరచుగా ప్రాథమిక మినహాయింపు, ఇతర డిడక్షన్‌లను రెండుసార్లు క్లెయిమ్ చేస్తారు. పెట్టుబడి డిక్లరేషన్‌లు రెండు ఉద్యోగ సంస్థలకు సమర్పించినప్పుడు, వారు విడిగా ప్రాథమిక మినహాయింపు పరిమితి, స్టాండర్డ్ డిడక్షన్, చాప్టర్ VI-A డిడక్షన్‌లను వర్తింపజేయవచ్చు. ఇది పన్ను ప్రయోజనాలను అధికంగా పొందేందుకు దారితీస్తుంది, ఫలితంగా టీడీఎస్ (TDS) తక్కువగా కట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో, ITR దాఖలు చేసేటప్పుడు రెండు ఉద్యోగాల ఆదాయాన్ని కలిపి సరిగ్గా లెక్కించి చూపించాలి.HRA (హౌస్ రెంట్ అలవెన్స్)..HRA మినహాయింపు కోసం తప్పుడు క్లెయిమ్ చేస్తే తీవ్రమైన జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తప్పుగా చూపిన మొత్తంలో 200 శాతం వరకు జరిమానా పడొచ్చు. పాత పన్ను విధానం కింద జీతం పొందే ఉద్యోగులు HRA మినహాయింపును క్లెయిమ్ చేయొచ్చు. అయితే, దీని కోసం సరైన అద్దె ఒప్పందం, అద్దె రసీదులు, ఇంటి యజమాని పాన్ (వార్షిక అద్దె రూ. 1 లక్షకు మించితే) వంటి పత్రాలను యజమానికి సమర్పించాలి. అద్దె ఇంట్లో నివసించినట్లు కూడా నిర్ధారించాలి. ఈ వివరాల్లో తప్పులు దొర్లితే సమస్యలు తప్పవు.ఐటీఆర్ దాఖలు చేయడం అనేది మన బాధ్యత. పైన పేర్కొన్న తప్పుల్ని నివారించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు అనవసరమైన నోటీసులు, జరిమానాలు, చట్టపరమైన సమస్యల నుంచి బయటపడొచ్చు. సందేహాలు ఉంటే పన్ను నిపుణులను సంప్రదించడం మంచిది.