భారీగా తగ్గి స్థిరంగా బంగారం ధరలు.. ఇదే మంచి ఛాన్స్.. నేటి గోల్డ్ రేట్లు ఇవే!

Wait 5 sec.

Gold Rate Today: బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం. ఎంతో కొంత బంగారం తమ వద్ద ఉండాలనుకుంటారు. మహిళలు పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు. అందుకే మన దేశంలోకి ప్రతి సంవత్సరం టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంటుంది. ఎంతలా అంటే ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశం రెండో స్థానంలో ఉంది. భారతీయుల జీవితాల్లో ఒక భాగమైన ఈ ఏడాది భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, దేశాల మధ్య యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, డాలర్ విలువ వంటివి ఎన్నో అంశాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. గత వారంలో భారీగా పెరుగుతూ వచ్చిన క్రితం రోజు ఒక్కసారిగా పడిపోయిన సంగతి తెలిసింది. మళ్లీ ఇవాళ అదే ధర వద్ద ట్రేడవుతున్నాయి. మరి జూన్ 9వ తేదీన హైదరాబాద్‌లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3306 డాలర్ల వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఒక ఔన్సుకు 36.07 డాలర్లుగా కొనసాగుతోంది. మరోవైపు.. ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ మరింత దిగజారింది. డాలర్‌తో పోల్చి చూస్తే ఇప్పుడు రూ. 85.808 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాముల ధర రూ. 97 వేల 970 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 89 వేల 800 వద్ద కొనసాగుతోంది. స్థిరంగానే వెండి ధర.. బంగారం ధరలు దిగివస్తుంటే వెండి మాత్రం షాకులు ఇస్తోంది. ఇటీవల భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, గత రెండు రోజులుగా అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,18,000 వద్ద ట్రేడవుతోంది. ఈ కథనంలో పైర్కొన్న బంగారం, జూన్ 9వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే బులియన్ మార్కెట్లో ధరలు మాధ్యాహ్నానికి మారుతుంటాయి. అంటే బంగారం, వెండి ధరలు మారవచ్చు. ఇక పన్నులు కలిపి లెక్కిస్తే ధరలు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. అందుకే కొనుగోలు చేసే ముందే తెలుసుకోవడం మంచిది.