Tirumala శ్రీవారికి రూ.100 కోట్లు విరాళం ఇచ్చిన భక్తుడి కన్నుమూత.. ఎవరీ వేగేశ్న ఆనందరాజు

Wait 5 sec.

ప్రముఖ దాత, రాజు వేగేశ్న ఫౌండేషన్ సంచాలకుడు వేగేశ్న ఆనందరాజు కన్నుమూశారు.. ఆయన వయసు 67 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖపట్నంలో ఆదివారం రోజు తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆనందరాజు ద్వారా అనేక దేవాలయాలకు సహాయం చేశారు.. రూ. కోట్లు ఖర్చు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తుల కోసం అవసరమైన సౌకర్యాల కల్పనకు రూ.కోట్లు ఖర్చు చేశారు. ఆనందరాజు రాజు వేగేశ్న ఫౌండేషన్ ద్వారాలో రూ.77 కోట్లతో అన్నదాన సత్రం కట్టించారు.. రూ.27 కోట్లతో వాటర్ ప్యూరిఫై చేసే ప్లాంట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ ప్లాంట్ నిర్వహణ కోసం ఏటా రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చేవారు. షిర్డీలో కూడా నీటి ప్లాంట్ ఏర్పాటు చేశారు. తిరుపతి, ద్వారకా తిరుమలలో ఆసుపత్రులు నిర్మించారు. ఆనందరాజు తెలంగాణలోని ఆలయాలకు కూడా సాయ అందించారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఏకంగా రూ.25 కోట్లతో అన్నదాన సత్రం నిర్మించారు. అంతేకాదు పలు దేవాలయాల దగ్గర బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించారు. విశాపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, ద్వారకా బస్టాండ్‌ దగ్గర ప్రయాణికుల కోసం సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది పేద పిల్లల చదువుకు సహాయం చేశారు. ఆనందరాజు తన స్వస్థలమైన పశ్చిమగోదావరి జిల్లాలో గణపవరంలో ఏకంగా ఆరు ఎకరాల స్థలం కొని పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన గొప్ప వ్యక్తి. ఆనందరాజు విశాఖపట్నానికి 1979లో వచ్చారు.. గత పదేళ్లుగా రాజు వేగ్నేశ ఫౌండేషన్ సాయంతో హైదరాబాద్, విశాఖపట్నంలో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన ఫౌండేషన్ ద్వారా ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆనందరాజు మరణంపై రాజకీయ, వ్యాపార ప్రముఖులు సంతపాన్ని తెలియజేశారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని.. ఆయన గతంలో చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.