శ్రీశైలం ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 24 వరకు శ్రావణమాస ఉత్సవాలు జరుగుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రత్యేక రోజుల్లో గర్భాలయ అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. శ్రావణమాస ఏర్పాట్లపై ఆలయ అధికారులతో ఈవో శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రావణ మాసంలో రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అభిషేకాలు నిలిపివేయనున్నారు. అలాగే భక్తులందరికి మల్లన్న అలంకార దర్శనం.. అలాగే శ్రావణ మాసంలో వీకెండ్ (శనివారం, ఆదివారం).. సోమవారం, పర్వదినాలలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తారు.రద్దీగా ఉండే రోజుల్లో రోజుకు మూడుసార్లు మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనం పూర్తిగా నిలిపివేస్తామని ఆయన అన్నారు. శ్రీశైలం వచ్చే భక్తులు ఈ మార్పులను గమనించాలని కోరారు. శ్రావణ శనివారాలు, ఆదివారాలు, సోమవారాలు, వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి రోజుల్లో గర్భాలయ అభిషేకాలు ఉండవన్నారు ఈవో శ్రీనివాసరావు. అంటే దాదాపు 16 రోజుల పాటు అభిషేకాలు నిలిపివేస్తారు.. మిగిలిన రోజుల్లో మాత్రం అభిషేకాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. మరోవైపు శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారి భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. గతంలో లాగానే వారంలో నాలుగు రోజులు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుంది. సామాన్య భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడంతోనే సర్వదర్శనాలు తిరిగి ప్రారంభించారు. మల్లికార్జునస్వామిని స్వయంగా తాకడం వలన భక్తులు ఆధ్యాత్మిక అనుభూతి పొందుతారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం స్పర్శ దర్శనం టికెట్లు, ఇతర ఆర్జిత సేవల టికెట్ల మాదిరిగానే ఉచిత స్పర్శ దర్శనం టికెట్లను కూడా ఆన్‌లైన్‌లో పొందవచ్చు. రోజుకు వెయ్యి టోకెన్లను మాత్రమే srisailadevasthanam.org, aptemples.ap.gov.in వెబ్‌సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఉచిత టోకెన్లను కూడా పరోక్ష సేవల విధానంలో ఒకరోజు ముందుగానే పొందాలి. ఉదాహరణకు మంగళవారం మధ్యాహ్నం స్పర్శ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు సోమవారం నిర్దిష్ట సమయంలో టికెట్లు పొందాలి. ఈ మేరకు భక్తులు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో పొందిన టికెట్లను స్కానింగ్ చేసి, ఆధార్ కార్డుతో సరిపోల్చిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం వేళల్లో ఆలయ శుద్ధి, మంగళవాయిద్యాలు, సుసాంధ్యము, ప్రదోషకాల పూజలు నిర్వహిస్తారు. అందుకే మధ్యాహ్నం 1.45 గంటల నుంచి స్పర్శ దర్శనాలు కల్పిస్తారు.