హమ్మయ్యా.. తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే, తులం ఎంతకు దిగొచ్చిందంటే?

Wait 5 sec.

Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. దేశీయ మార్కెట్లో ఇవాళ తగ్గాయి. వరుసగా పెరుగుతూ భయపెట్టిన పసిడి ధరలు ఇవాళ దిగిరావడంతో కొనుగోలుదారులకు ఉపశమనం లభించినట్లయింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు దిగిరావడం కలిసొచ్చింది. ట్రంప్ నిర్ణయాలతో సంబంధం లేకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వ్యవహరిస్తుండడం, వడ్డీ రేట్ల తగ్గింపు ఉండదని ప్రకటించడం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తోంది. బంగారానికి గిరాకీ తగ్గి ధరలు దిగివస్తున్నాయి. దేశీయంగా పండగల సీజన్ మొదలైన క్రమంలో పసిడి ధరలు తగ్గడం మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో జూలై 8వ తేదీన తులం బంగారం రేటు ఎంతకు దిగివచ్చిందో తెలుసుకుందాం. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు ఇవాళ తగ్గాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 3334 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్ ధర 36.69 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. భారత కరెన్సీ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే కాస్త పుంజుకుని రూ.85.79 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధరలు గత రెండ్రోజులు స్వల్పంగా పెరిగి కంగారు పెట్టిన పసిడి ధరలు ఇవాళ మళ్లీ తగ్గడం ఊరట కల్పించే విషయం. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ (999 ప్యూరిటీ) తులం రేటు రూ.540 తగ్గింది. దీంతో 10 గ్రాములకు రూ. 98 వేల 290 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.500 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం (తులం) రేటు రూ. 90 వేల 100 వద్దకు పడిపోయింది. స్థిరంగానే వెండి రేట్లుబంగారంతో సమానంగా పరుగులు పెడుతున్న కాస్త శాంతించాయి. గత రెండ్రోజులుగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 1,19,900 మార్క్ వద్దే ట్రేడవుతోంది. పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు జూలై 8వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో పసిడి ధరలు మధ్యాహ్నం మారుతుంటాయి. జీఎస్టీ, ఇతర పన్నులు కలిపి లెక్కగడితే బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రాంతాలను బట్టి మారతాయి. అందుకే కొనేముందే తెలుసుకోవడం మంచిది.